రాయలసీమ సమస్యలపై పోరాటం ఉధృతం - ఆర్వీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాధ్

- ఘనంగా రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ 10వ ఆవిర్భావ వారోత్సవాలు

- రాయలసీమను రతనాల సీమగా మార్చుకుందాం

- ఆర్వీఎఫ్ సీమ జిల్లాలో రాజీలేని పోరాటం -  రాష్ట్ర ఉపాధ్యక్షులు దామోదరం నాగన్న
కర్నూలు, త్రిశూల్ న్యూస్ :
 రాయలసీమ ప్రాంత విద్యార్దుల, యువకుల సమష్యలపై, సీమ హక్కులకై, ఉపాధి, ఉద్యోగాల కోసం, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే లక్ష్యంగా పోరు బాట సాగిస్తున్న ఆర్వీఎఫ్ రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ ఆవిర్భవించి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆర్వీఎఫ్ 10వ ఆవిర్భావ వారోత్సవాలను కర్నూలులోని శ్రీమేధ కళాశాలలో ఆర్వీఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు నాగరాజు అధ్వర్యంలో ఆర్వీఎఫ్ రాష్ట్ర నేతలు విద్యార్దినీలతో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
అనంతరం విద్యార్ధినీలకు ఆర్వీఎఫ్ ఆశయాలు వివరించారు. ఈ సందర్బంగా ఆర్వీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాధ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామోదరం నాగన్నలు మాట్లాడుతూ
రాయలసీమ అస్ధిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, సీమ హక్కులకై, వెనుకబాటు తనంపై పోరుబాట సాగించేందుకు 2014 సంవత్సరం జూలై 13 తేదీన నంద్యాల జిల్లా కేంద్రం నంద్యాలలో ఆర్వీఎఫ్ ఆవిర్భవించిందని.. ఈ 9 సంవత్సరాల కాలంలో అనేక సమస్యలపై పోరాటాలు చేశామన్నారు. ఎన్నో సమష్యల పరిష్కారానికై ఆర్వీఎఫ్ నడుం బిగించిందని.. రాయలసీమ జిల్లాలలో బలమైన ఉధ్యమం నడిపిన ఆర్వీఎఫ్.. నాలుగు జిల్లాలలో ఎప్పటికప్పుడు విద్యార్ది, ప్రజా సమష్యలపై పోరుబాట సాగిస్తుందన్నారు. ఈ ఆవిర్భావ వారోత్సవాలు రాయలసీమలోని నాలుగు జిల్లాలలో నిర్వహించి నూతన కమిటీలు వేయనున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎఫ్ మాజీ కర్నూలు జిల్లా కార్యదర్శి బాలరాజు, కర్నూలు నగర నేతలు సురేంద్ర, ప్రకాష్, శ్వేత, సాయి ప్రియ, తులసి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు