ఒంటరి జీవితం భారమై.. గుడుపల్లె తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఎ ఆత్మహత్య..?
గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ :
నా అనుకున్న వాళ్లు ఎవరూ లేరు.. ఒంటరి జీవితం భారమైపోయా..? కొన్ని సంవత్సరాలుగా ఇదే మనోవేదన, తాసిల్దార్ కార్యాలయంలో పడుకోవడం.. అక్కడే ఉద్యోగం చేయడం ఇదే గోవిందప్ప దినచర్య..? కానీ ఎలా జరిగిందో..? ఏం జరిగిందో తెలియదు గాని శుక్రవారం ఉదయం పనిచేసే తాసిల్దార్ కార్యాలయం నందు ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ప్రకారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం తాసిల్దార్ కార్యాలయంలో గోవిందప్ప స్వంత ఊరు పెద్దకొటామాకనపల్లె గ్రామానికి చెందిన వి. గోవిందప్ప (72) విఆర్ఎగా పనిచేస్తున్నారు. వయసు మీదపడిన తహసీల్దార్ కార్యాలయం మాత్రం వీడి పోలేదు. తనకు ఎవరు లేకపోవడంతో ఇక్కడే తినడం, ఇక్కడే పడుకోవడం. కానీ శుక్రవారం ఉదయం కార్యాలయంకు వచ్చిన సిబ్బందికి కార్యాలయంకు లోపల గడి పెట్టడంతో అనుమానం వచ్చి తలుపులు బాధడంతో ఎంతకు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఓ పక్కన కిటికీ ఓపెన్ లో ఉండడంతో లోపలకి చూసి ఒక్క సరిగా భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే విషయం తహసీల్దార్ కి తెలియజేశారు. అయన వెంటనే గుడుపల్లె పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ గోవిందప్ప మృత దేహం... గోవిందప్ప మృత దేవాన్ని పోస్టు మార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా పెద్దకోటమాకులపల్లెలో గోవిందప్ప మృత దేహానికి గుడుపల్లె తాసిల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు.
గుడుపల్లి మండలం ON కొత్తూరు గ్రామ పంచాయతీ పెద్దకోటమాకుల పల్లి గ్రామానికి చెందిన V. గోవిందప్ప, వయస్సు. 72 సం.రాలు, కులం.SC, అను అతను ON కొత్తూరు గ్రామ పంచాయతీ VRA గా విధులు నిర్వర్తించే వాడు. ఇతనికి ఇద్దరు భార్యలు 1) గోవిందమ్మ, 2) జయమ్మ అను ఇద్దరు భార్యలు కలరు. వీరికి పిల్లలు లేరు. ఇద్దరు భార్యలు కూడా గోవిందప్ప ను వదిలి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయి ఉన్నారు. VRA గోవిందప్ప ఉద్యోగం చేసుకుంటూ గుడుపల్లి హోటళ్లలో తినుకొంటూ అప్పుడప్పుడు వారి సొంతూరుకు పోయి అతని అన్నదమ్ముల ఇండ్లలో ఉంటూ ఉద్యోగం చేసుకునేవాడు. విధులలో భాగంగా నిన్నటి రాత్రి MRO కార్యాలయంలో రాత్రి డ్యూటీ గోవిందప్ప అతనితో పాటు బోయనపల్లి గ్రామానికి చెందిన మరో VRA గోవిందప్ప ఇద్దరు ఉండి. ఈ రోజు ఉదయం 6.00 గం.కు బోయనపల్లి కి చెందిన VRA గోవిందప్ప ఇంటికి వెళ్లడంతో తరువాత VRA V. గోవిందప్ప తహశీల్దార్ కార్యాలయంలో లోపలి వైపు గడియ పెట్టి లోపలి వైపు ప్యానుకు వైరు తో ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు.
Comments
Post a Comment