కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలను కూలగొడుదాం - సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్

కళ్యాణదుర్గం, త్రిశూల్ న్యూస్ :
పేదల పట్ల అనుకూల నిర్ణయాలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలను కూల కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చా రు. గురువారం కుందుర్పి మండలం తూముకుంట గ్రామంలో సీపీఐ కార్యాలయం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మండల కార్యదర్శి శివలింగప్ప, గ్రామ కార్యదర్శి నాగరాజులు అధ్యక్షత వహించారు. సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి గోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సీనియర్ నాయకులు విరూపాక్షప్ప జండా ఆవిష్కరణ చేయగా అనంతరం జరిగిన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పని లేక వలస వెళుతున్న వారిని అడ్డుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా పథకాలు దేనికని ప్రశ్నించారు. దొంగల అధిపతిగా మోడీ, అపద్దాల అధిపతిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాంకేతిక రంగాలను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టిన మోడీ, జగన్ ప్రభుత్వాలను ఇంటికి పంపాలన్నారు. ఉపాధి పథకం తీసుకురావడానికి కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు గుర్తు చేస్తూ భవిష్యత్తు పోరాటాలకు ప్రజల సిద్ధంగా ఉండాలన్నారు. శ్రీశైలం డ్యాం నుండి జీడిపల్లి రిజర్వాయర్కు నీటిని తీసుకురావడానికి కాలువలను వెడల్పు చేయాల్సి ఉందని.. బిటిపి డ్యాంకు హంద్రీనీవా ద్వారా నీళ్లు తీసుకురావడానికి నిధులు అరకొరగా కేటాయించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని ఆరోపించారు. దొంగల అధిపతిగా మోడీ కొనసాగుతున్నాడని.. ప్రశ్నిస్తే జైల్లో పెట్టించడానికి జగన్ ప్రభుత్వం వెలకాడబోదని ఇలాంటి వారిపై ప్రజలు దండయాత్ర చేయాలన్నారు. దేశంలో నోట్ల రద్దు చేయడం ద్వారా కోలుకోలేని దెబ్బ పడింది అన్నారు. వ్యవసాయం, కార్మిక, ఉద్యోగ రంగాల్లో నష్టాలు చవిచూసారన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో మతోన్మాదం, విభజించు పాలించు, కులాల విచ్ఛిన్నం ద్వారా అధికారంలోకి రావాలని బిజెపి భావజాలాన్ని ప్రజల్లో నింపడానికి విద్యా కాషాయీకరణ తీసుకు వస్తున్నారని మండిపడ్డారు. మణిపూర్ లో మారణకాండ జరుగుతున్నా మోడీ దేశ విదేశాలకు వెళ్తున్నాడని, శాంతి నెలకొల్పాలే కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారన్నారు. జగన్ హత్య రాజకీయాలకు, సిబిఐ కేసులకు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. అమ్మా, చెల్లలను ఇక్కడి నుంచి తరిమికొట్టిన వాడు రాష్ట్ర ప్రజలను ఏమి కాపాడుతాడని జగన్ ని ఉద్దేశించి ప్రశ్నించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప గోపాల్ మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హంద్రీనీవా పథకాన్ని పూర్తిచేసి 114 చెరువులకు నీరు ఇవ్వాల్సిన జగన్ అబద్ధపు మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నాడన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర, నవలి ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తున్న పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి వై. గోపాల్, మహదేవ్ మాజీ ఎంపీపీ గిరిజ, రైతు సంఘం నాయకులు హరిదాసు, నరసింహులు, సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు బసవరాజు, బొమ్మలింగ, ఓబులపతి, కే గోపాల్, కర్ణాటక పావగడ తాలూకా సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, మాజీ మండల కార్యదర్శి రామకృష్ణ, సీనియర్ నాయకులు బికే గోపాల్ ఆగులూరప్ప, అశ్వర్త, కంబదూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం శెట్టూరు మండల కార్యదర్శులు తిరుపాల్, నాగరాజు నాయక్, ఆంజనేయులు, జయ రాములు, నంజప్ప తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు