రైతులతో చేలగాటం ఆడితే సహించేది లేదు - జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల
జగిత్యాల, త్రిశూల్ న్యూస్ :
అప్పో సప్పో చేసి పెట్టుబడి పెట్టి రెక్కలు ముక్కలు చేసుకొని ఇంటిల్లిపాది ఎండనక, వాననాక, చలి అనక రెయిoబవాళ్ళు శ్రేమించి పండించే అన్నదాతతో ప్రభుత్వం చేలగాటం ఆడితే ఎట్టిపరిస్థితులల్లో సహించేది లేదని రైతు రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే పరాజితుడు అభ్యుదయ యువ రైతు జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అన్నారు. సోమవారం రైతుల ఇబ్బందులు, సమస్యలు తెలుసుకొనేందుకు జగిత్యాల జిల్లాలో పలు ప్రాంతాలలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ అనుక్షనం అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం అరిగోసపెట్టడం ఇదివరకే ఎన్నో మార్లు స్పష్టం అవగా మరో మారుగా ప్రభుత్వం అధికారులు రైతును అయోమయంలో ముంచి నష్టపరిచే విధంగా ఉద్యనవన సాగుకు ప్రభుత్వ ప్రోస్సహం అంటూ రైతులను ఉరిస్తున్నారు. ఇది తగదు అని గతంలో కేవలం ఆయిల్ ఫామ్ సాగుకు తప్ప దేనికి సబ్సిడీలు లేవని రైతులను ఇబ్బంది పెట్టి ఇప్పుడు జోరు వర్షాకాలంలో ఆగమేఘాలపై లక్ష్యం చేరుకొనేందుకు అతి కొద్ది గడువుతో లబ్ధిదారుల ఎoపికకు చివరి గడువు అనడం సబబు కాదన్నారు. ఇప్పటికే రైతులు ఏదో పంట సాగు చేసి ఉన్నారు.. ఇప్పుడు నడికాలంలో సాగు చేసుకోవాలంటే ఎలా.. వేసవిలో ప్రణాళికలు రూపొందించి వర్షాకాలం ముందే సంసిద్ధం చేస్తే సరి పోవుగా అన్నారు. అలా చేయక రైతులను ఎటుపాలుపోని స్థితికి గురిచేయడం సిగ్గుచేటు అని.. ఇప్పటికయినా ప్రభుత్వం మరియు ఉన్నత అధికారులు పునరాలోచన చేయాలని లేని పక్షంలో రైతాంగం నుండి పెద్ద ఎత్తున నిరసన ఎదురుకోక తప్పదని జోస్యం చెప్పారు.
Comments
Post a Comment