వైసిపి హయాంలో వేల ఎకరాల వక్ఫ్ భూములను కబ్జా - కుప్పం టిడిపి పరిశీలకులు గాజుల ఖాదర్ బాషా
- ముస్లింలపై దాడులు, అఘాయిత్యాలు, అకృత్యాలకు పాల్పడ్డ వైసిపి
- విలేకరుల సమావేశంలో కుప్పం నియోజకవర్గ పరిశీలకులు గాజుల ఖాదర్ బాషా
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
మైనార్టీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్, వైసీపీ నాయకులు తప్పుడు ప్రకటనలు మానుకోవాలని కుప్పం నియోజకవర్గ పరిశీలకులు గాజుల ఖాదర్బాషా అన్నారు. కుప్పం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల వేధింపులకు తాళ లేక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. 2019 జూన్ నుండి 2021 ఆగస్టు వరకు దాదాపు రూ. 1,483.62 కోట్ల మైనారిటీ నిధులను దారి మళ్లించినట్టు.. వేల ఎకరాల వక్ఫ్ భూములను కబ్జా చేసినట్టు ఆరోపించారు. మైనార్టీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ముస్లీంల విద్యార్ధులకు విదేశీ విద్య పథకాన్ని రద్దు చేయడమే కాకుండా జగన్ రెడ్డి పాలనలో ఒక్క ముస్లీం కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని వైసిపి నాయకులకు ప్రశ్నించారు.? ఆయన దృష్టిలో ముస్లీంలు కేవలం ఓటు బ్యాంకేనా అన్నారు. ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా అలంకార ప్రాయంగా, ఉత్సవ విగ్రహంలా మారిపోయారని, ముస్లీంలకు అన్యాయం చేస్తున్న జగన్ రెడ్డిపై తిరగబడాల్సిన తరుణం ఆసన్నమైందని, ముస్లీం, మైనార్టీలందరూ ప్రభుత్వంపై సమైఖ్యంగా పోరాడి మన హక్కులను కాపాడుకోవాలి అని అన్నారు. ఉన్నత విద్య, విదేశీ విద్య మైనారిటీ విద్యార్థులకు అందని ద్రాక్షలా మారిందన్నారు. ఎన్నో ఏళ్లుగా ముస్లిం యువతకు పెళ్లికానుకగా ఇచ్చే దుల్హన్ పథకానికి చరమగీతం పాడిన ఘనత జగనన్నది అంటూ ఎద్దేవా చేశారు. టిడిపి హయాములో ప్రభుత్వం తరపున పండుగల వేళ మైనారిటీ పేదలకు ఇచ్చిన రంజాన్ తోఫా పథకాన్నీ మాయం చేశారట్టు తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు తోఫా ఇస్తే జగనన్న డోకా ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. ముస్లింలలో ఎక్కువ మంది పేదరికంలో మగ్గుతున్నారని, ప్రభుత్వం అందించే స్వయం ఉపాధి సహయం ముస్లీంలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నాడు టిడిపి ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలు అమల్లోకి తెచ్చిందని అన్నారు. ఇలాంటి ఎన్నో పథకాలను వైసిపి ప్రభుత్వం కనుమరుగు చేసి ముస్లింలకు ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. కావున రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు వైసీపీ చేసిన ద్రోహాన్ని గుర్తించి రాబోవు ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 2024లో ముస్లిం అభ్యున్నతికి పాటుపడే టిడిపిని అధికారంలోనికి తీసుకురావడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిములు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమా వేశము లో నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు జాకీర్ అహ్మద్, రామకుప్పం క్లస్టర్ ఇంఛార్జి రఫీ క్ పాల్గొన్నారు.
Comments
Post a Comment