ఆధునిక "భారత్"లో.. "ఆటవిక" క్రీడలు.. మణిపూర్ దుర్ఘటనలపై ప్రత్యేక విశ్లేషణ..!
త్రిశూల్ న్యూస్ డెస్క్ :
ఎవరో అక్కడ ఆట మొదలుపెట్టారు.. ఎవరెవరో ఆటలాడారు.. అందలో కొందరు గెలిచారు.. కొందరు ఓడారు.. చివరికి ప్రజలు, న్యాయస్థానాలు చీకొట్టేవరకు తెచ్చుకున్నారు.. నాలుకరుచుకున్నారు.. దుండగులను శిక్షిస్తాం..అది చేస్తాం, ఇది చేస్తామంటూ మీడియా ముందు రక్తి కట్టించారు..సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత నోరు కదిపారు..ఆడబిడ్డల మానప్రాణాలు అంటే అంత అలుసా అని,ప్రజలు తిరగబడితే గాని,జ్ఞానోదయం రాని ఈ పాలకులు మన దేశాన్ని ఎటు తీసుకుపోతున్నారో అనే ఒక ప్రశ్న 140 కోట్ల మంది భారతీయుల్లో కలిగింది..?
వివరాలు పరిశీలిస్తే..!
గిరిజనులు, గిరిజనేతరుల మధ్య అగ్గి రగిలించి, 150 మందికిపైగా పౌరులు మరణిస్తే గాని, చలించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక్కసారిగా ముగ్గురు ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు, సామూహిక అత్యాచారం, ఆపై పాసవిక హత్యలు. ఇలాంటి వార్తలు బయటకు వస్తే గాని నోరు కదపలేదు. సుప్రీంకోర్టు సుమోటాగా కేసు తీసుకునే వరకు చలనం లేదంటే, ఇక దేశ పౌరుల భద్రత ఎలా ఉందో మనం చెప్పనవసరం లేదు.? 53% ఉన్న మైతేయిలకు, 40 శాతం పైగా ఉన్న నాగా, కూకిలకు మధ్య మే నెల మొదటి నుంచి జరుగుతున్న అంతర్గత యుద్ధం యావత్ భారతదేశాన్ని కదిలించింది అనే విషయాన్ని మనం కొత్తగా చెప్పనవసరం లేదు. ఇంపాల్ లోయలోని మూడు చర్చిలను కూలదోసి అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం దేశం మొత్తం తెలిసిన విషయమే. గిరిజనుల హక్కుల కోసం మే ఫస్ట్ నుండి గిరిజన సంఘీభావ యాత్ర జరగడం, గిరిజనుల, గిరిజనేతరుల మధ్య వివాదం తలెత్తడంతో, ప్రారంభమైన ఈ రచ్చ, ఇద్దరు /ముగ్గురు గిరిజన మహిళలపై జరిగిన అత్యాచారాలతో అన్ని విషయాలు బయటకి ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఇంచుమించు 10,000 మందికి పైగా నిరాశ్రయులు కావడం, ప్రధానంగా క్రిస్టియన్ మైనారిటీలపై దాడులు జరగడం,150 మందికి పైగా పౌరులు మరణించడం నిజంగా చరిత్రలో ఇది ఒక చెరగని మచ్చగా చెప్పవచ్చు. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఈ విషయంపై ఆగ్రహాన్ని వెల్లబుచ్చి అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని గట్టిగా నిలదీయడంతో నిందితులకు ఉరిశిక్షపడేటట్లు చేస్తాము అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హడావుడిగా ప్రకటించడం నిజంగా పౌరులు పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ప్రతి ఒక్కరికి అర్థం అయింది.?నిస్సహాయ స్థితిలో ఉన్న ఐదుగురిని తమ అదుపులోకి తీసుకొని, అందులో ఇద్దరు మగవారిని కర్కసంగా చంపి, ముగ్గురు మహిళలను పూర్తి నగ్నంగా మార్చి, వారిపై మారణాయుధాలతో దాడులు చేస్తూ, రోడ్లపై వారిని ఊరేగించి, చివరికి వారిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టడానికి కూడా వెనుకాడ లేదంటే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చూసి దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. సామూహిక అత్యాచారం తర్వాత ఆ మహిళలను పాసవికంగా హత్య చేశారంటూ ఎఫ్ఐఆర్ అయినట్లు కొన్ని కథనాలు వచ్చినా తదుపరి వివరాలు ఇంతవరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదు..? ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమారుడు, కూతురు, భార్య, మరొక మహిళను వారు వేధించి, వాళ్ళని అత్యంత దారుణంగా హత్య చేశారు అనే వార్తను బయట ప్రపంచానికి తెలియకుండా 70 రోజులు దాచిపెట్టిన ఆ రాష్ట్ర ప్రభుత్వం చివరికి సుప్రీంకోర్టు మొట్టికాయ వేస్తే అప్పుడు నాలుక కరచుకొని నిందితులను అదుపులోకి తీసుకొనిజైలుకు పంపించి కేసు దర్యాప్తుకు ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. హక్కుల కోసం పోరాడడంలో తప్పులేదు గాని స్త్రీల మాన ప్రాణాలను దోచుకోవడం వారి ఆత్మగౌరవాన్ని భంగపరచడం నిజంగా క్షమించరాని నేరం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కొంతమంది కాలరాస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం క్షమించరాని నేరం. ఈ ఒక్క సంఘటన వెలుగులోకి వచ్చింది కానీ వెలుగులోకి రాని కొన్ని వందల సంఘటనలు ఆ రాష్ట్రంలో జరిగాయని కొంతమంది మేధావులు బాహాటంగా చెబుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను, మహిళలను వేధించడం, వారి ఆత్మగౌరవాన్ని భంగపరచడం భారత రాజ్యాంగానికి తూట్లపోడవడంతో సమానం. రాజకీయ పట్టు కోసమో (లేక) కార్పొరేట్లకు దాసోహం అవ్వడం కోసంమో అమాయక గిరిజన ప్రజలపై దాస్టికానికి ఉసుగొలిపిన తెరచాటు నాయకులకు, ప్రజలు గుణపాఠం చెప్పి తీరాలి. జాతీయవాదానికి తూట్లు పొడుస్తున్న కొంతమంది మతఛాందసవాదులకు బుద్ధి చెప్పి ఈ దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, రాజ్యాంగా నిలబెట్టాలి. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్రాన్ని కల్పించాలి. అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి, ప్రజలందరిలోనూ వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సౌబ్రాతృత్వాన్ని పెంపొందించడానికి, ప్రతి ఒక్కరు కృషి చేయాలి..ఇదే మన రాజ్యాంగ స్ఫూర్తి.
పొట్నూరు కిరణ్ కుమార్
సీనియర్ జర్నలిస్ట్, ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ 2023 ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ,
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి
Comments
Post a Comment