పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే తప్పక విజయం సాధించి జనసేన జెండా ఎగరవేస్తాం - తిరుపతి జనసేన నేతలు

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో, సభ్యత్వాలను నమోదు చేయించిన ప్రతి ఒక్కరికి ఆదివారం సభ్యత్వంకు సంబంధించిన కీట్లను జిల్లా అధ్యక్షులు డా. హరి ప్రసాద్, ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజా రెడ్డిల చేతుల మీదుగా కార్యకర్తలకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలు వేరు, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసిన తర్వాత నుంచి వేరు అని, ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పని చేస్తే రాబోయే రోజుల్లో జనసేన జెండాను ఎగరవేయడం ఖాయమన్నారు. జనసేన అధినేతను ముఖ్యమంత్రి చేసుకొని తీరుతామని, అధికార పార్టీకి ఒక జనసేన పార్టీనే ప్రత్యర్థి పార్టీ అని ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన రేపు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసి రాయలసీమలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపేలా సభ్యత్వాలను నమోదు చేయించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు