ఉమ్మడి కృష్ణాలో 19 నుంచి లోకేష్ యువ‌గ‌ళం పాదయాత్ర – ఏర్పాట్ల‌లో టిడిపి నేత‌లు

విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
యువగలం పేరుతో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలో జరగనుంది. ఈనెల 19వ తేదీ నుండి మూడు రోజులపాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలో యువగళం పాదయాత్ర జరగనుంది. ఈనెల 19వ తేదీ శుక్రవారం ఎన్టీఆర్ జిల్లాల్లోకి ప్రవేశించి రెండు రోజులపాటు విజయవాడ మూడు నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగ‌నుంది. మొదటి రోజు ప్రకాశం బ్యారేజీ మీదుగా ప్రారంభమవుతున్న లోకేష్ యువగలం పాదయాత్ర వినాయక టెంపుల్, పోలీస్ కంట్రోల్ రూమ్, స్వర్ణ ప్యాలెస్, విజయ టాకీస్, సీతాపురం సిగ్నల్స్, చుట్టుగుంట, బిఎస్ఎన్ఎల్ కార్యాలయం మీదుగా ర్యాలీ సాగుతుంది. అలాగే నైస్ బార్, ఇందిరాగాంధీ స్టేడియం మార్గంలో ఏ కన్వెన్షన్ సెంటర్ వరకు పాద‌యాత్ర ఉంటుంది. ఇక్కడ విడిది కోసం ఏర్పాటులను తెదేపా సీనియర్ నేతలు చేస్తున్నారు. రెండవ రోజు ఈనెల 20వ తేదీన బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, బందర్ రోడ్డు, హైస్కూలు, రైతుబజార్ జంక్షన్, పంట కాలువ జంక్షన్, సనత్ నగర్ మీదుగా తూర్పు నియోజకవర్గంలో కొనసాగింది. అనంతరం సనత్ నగర్ నుండి కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేరుకోనుంది. పెనమలూరు నియోజకవర్గం లో కామయ్యతోపు, తాడిగడప సెంటర్, పోరంకి జంక్షన్, ఎం కన్వెన్షన్ సెంటర్కు చేరుకొనుంది. అక్కడ నుండి గన్నవరం పరిధిలో నిడమానురూ వరకు చేరుకుని నిడమానూరులో రాత్రి బస ఏర్పాటు చేయనున్నారు మోడల్ డైరీ ఎదురుగా బస కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రెండు రోజులపాటు మొత్తం 14 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగ‌నుంది. ఈనెల 21వ తేదీన మూడో రోజు నిర్మాణం నుండి జాతీయ రహదారి మీదగా గోడవల్లి, కేసరపల్లి, గన్నవరం వరకు చేరుకుని గన్నవరంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. నాలుగవ రోజు గన్నవరం నుండి ఆగిరిపల్లి మార్గంలో ఏలూరు జిల్లాలోనికి ప్రవేశించి పాదయాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలో ముగియనుంది. ఇప్పటికే రూట్ మ్యాప్ ను పూర్తిచేసిన తెదేపా సీనియర్ నేతలు పాదయాత్ర అనుమతుల కోసం జిల్లా పోలీస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 19, 20 తేదిలలో జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్బంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం, కొనకళ్ళ నారాయణరావు, పాలిటిబ్యూరో సభ్యులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమా మహేశ్వరరావు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తిలు యువ‌గ‌ళం బందోబస్తు కోసం విజయవాడ పోలీస్ కమిషన‌ర్ ను కలిసిన వినతి పత్రాన్ని అందజేశారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు