శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రాహ్మణ్యం స్వామి అడికృత్తిక బ్రహ్మోత్సవాల ఆదాయం రూ. 24,50920 లక్షలు..!

- గత ఏడాది కంటే భారీగా పెరిగిన హుండీ ఆదాయం
గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం గుడివంకలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి అడికృత్తిక బ్రహ్మోత్సవాల సందర్బంగా స్వామి వారికి ఆదాయం రూ. 24,50,920 లక్షలు చేకూరింది. గురువారం అడికృత్తిక బ్రహ్మోత్సవాలు చివరి రోజున స్వామి వారి హుండీ లెక్కింపును ఆలయ చేర్మెన్ సుబ్రహ్మణ్యం, దేవాదాయ శాఖ అధికారుల సమక్షములో నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులు సమర్పించిన కోళ్లు, గొర్రెలు వేలం ద్వారా రూ. 53,750లు, స్వామి ఉత్సవ ఊరేగింపు టికెట్ల విక్రయం ద్వారా రూ.1,86,425లు, భక్తులు అందించిన చందాల ద్వారా రూ.34,100లు,  హుండీ ద్వారా రూ.13,89645లు ఆదాయం చేకూరింది. బ్రహ్మోత్సవాలకు మునుప నిర్వహించిన వేలం పాట ద్వారా రూ. 7,87000 ఆదాయం వచ్చింది. ఇందులో లడ్డు ప్రసాదం ద్వారా రూ.4.5లక్షలు, అంగుళ్ల గేటు రూ. రూ.65 వేలు, తలనిలాలు రూ.2.72 లక్షలు వేలం పాటలో ఆలయానికి ఆదాయం వచ్చింది. గత ఏడాది బ్రహ్మోత్సవాల ఆదాయం కంటే రూ. 6లక్షలు అధిక ఆదాయం వచ్చినట్టు కమిటి అధ్యక్షులు తెలిపారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు