వైయస్సార్ కళ్యాణమస్తు.. షాదీ తోఫా కింద జిల్లాలో 444 మందికి రూ. 3.60 కోట్లు లబ్ది..!

చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలు మరియు పేద కుమార్తెల విభిన్న ప్రతిభావంతుల వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు/షాదీతోఫా పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నదని, ఈ పథకం పేద కుటుంబాలకు ఒక వరమని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి మూడవ విడత వైఎస్ఆర్ కళ్యాణమస్తు/షాదీతోఫా క్రింద ఆర్థిక సహాయాన్ని వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలో జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్, చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, మేయర్ అముద, రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ చైర్మన్ కుమార్ రాజా, జడ్పీ వైస్ చైర్ పర్సన్ రమ్య, జడ్పీ మహిళా స్థాయి సంఘ చైర్ పర్సన్ భారతిలతో పాటు డి ఆర్ డి ఎ పిడి తులసి, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖాధికారి రాజ్యలక్ష్మి, సంబంధింత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కళ్యాణమస్తు/షాదీ తోఫా పథకం ద్వారా రాష్ట్రం లోని ఎస్ సి, ఎస్. టి, బి.సి, మైనారిటీ పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లుల ఖాతాలకు రూ.40 వేలు మొదలు రూ.1,50,000 వరకు అర్హులైన వివాహిత జంటలకు కుల ప్రాతిపదికన వివాహ ఖర్చుల నిమిత్తం విడుదల చేయడం జరుగుతున్నదన్నారు. మూడవ విడత వై. యస్. ఆర్ కళ్యాణమస్తు/ షాదీ తోఫా పథకం క్రింద జిల్లాలో 444 మందికి రూ.3.60 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. 

సామాజిక వర్గాల వారీగా..!

         182 మంది ఎస్ సి లబ్ధిదారులకు రూ.1.85 కోట్లు, 15 మంది ఎస్ టి లబ్ధిదారులకు రూ.15 లక్షలు, 187 మంది బిసి లబ్ధిదారులకు రూ.98 లక్షలు, 52 మంది మైనారిటీ లకు రూ. 52 లక్షలు, భవన, ఇతర నిర్మాణ కార్మికులకు చెందిన ఒకరికి రూ.40 వేలు, 7 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.1.50 లక్షలు మొత్తం 444 మందికి రూ.3.60 కోట్లు లబ్ధి చేకూరింది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు