ముగిసిన అడికృత్తిక బ్రహ్మోత్సవాలు.. భక్తులతో కిటకిటలాడిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం..!

గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ :
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం గుడివంకలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం బుధ గురువారాల్లో భక్తులతో కిటకిటలాడింది. ఆడికృతిక సందర్భంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి మొక్కులు కలిగిన భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంతం హరోం హర అనే నినాదాలతో మార్మోగిపోయింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి మొక్కులు కలిగిన భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం నుండి ప్రతి నిత్యం భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. గురువారంతో అడికృత్తిక బ్రహ్మోత్సవాలు ముగిసింది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు