శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు ఉత్తమ సేవా పురస్కారం..!
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక రెడ్డి రెడ్డి కాలనీలో ఉన్న శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు ఉత్తమ సేవా పురస్కారం అవార్డును రాష్ట్ర డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి చేతులు ముందుగా మంగళవారం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అందించినందుకు గుర్తింపుగా ఉత్తమ సేవా పురస్కార పత్రాన్ని శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, డాక్టర్ బద్దెల సుకుమార్ వారి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉత్తమ సేవలు అందించినందుకు గుర్తింపుగా తమ ఆసుపత్రికి పురస్కారం అందించడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ ఉత్తమ సేవా పురస్కారం తమకు మరింత బాధ్యతను పెంచిందని ఈ స్ఫూర్తితో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని తెలియజేశారు.
Comments
Post a Comment