తిరుపతిలో ఘనంగా కాపు సంక్షేమ సేన మూడవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..!
- రాష్ట్ర సంక్షేమం కోసమైనా జనసేనాని సీఎం కావాలి.. హరి రామ జోగయ్య ఆకాంక్ష - కాపు సంక్షేమ సేన పిలుపు
- నేటి వైసిపి ప్రభుత్వ దోపిడి, గుండా గిరి పాలనలో ప్రజలు అనుభవిస్తున్న దారుణమైన పరిస్థితులను వివరించిన కాపు సంక్షేమ సేన నేతలు
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
ఆంధ్ర ప్రదేశ్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన వైసిపి పాలనలో ప్రజలు పూర్తిగా దోపిడీకి గురయ్యారని, రాష్ట్రం తిరిగి సుభిక్షంగా ఉండాలంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాపు సంక్షేమ సేన నాయకులు అభిప్రాయపడ్డారు. బుధవారం ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్, మరియు న్యాయవాదులు, డాక్టర్లు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.. కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆకేపాటి సుభాషిని, రాష్ట్ర అధికార ప్రతినిధి మెరుపుల మహేష్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కీర్తన , ముక్కు సత్యవంతుడు, వనజ, లక్ష్మీ, లావణ్య , గుట్ట నాగరాజు రాయల్, రాజేష్ యాదవ్, కరుణానిధి , యుగంధర్, హిమవంత్, ఈశ్వరాయల్, పవన్, ఆదికేశులు, రాంబాబు, వెంకట్, శ్రీ రామ్ లోచన్,కలప రవి, ప్రసాద్, హేమ కుమార్, బాబ్జి, రాజేష్ యాదవ్, హిమావంత్, రమేష్, రాజు, ఈశ్వర్ రాయల్, మస్తాన్ రాయల్ తదితరులు హాజరయ్యారు.
కుల , మతాలకు అతీతంగా.. ఇందులో ప్రధానంగా కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు ఏర్పాటుచేసిన ఈ సభ సారాంశం.. చరిత్ర నుండి రెండు ప్రధాన కులాలు రాజ్యమేలుతున్న ఈ తరుణంలో కాపు కులం నుండి ఓ సైనికుడిలా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు అన్నింటిని త్యజించి.. ఈ దోపిడీ పార్టీల అంతం చూసేందుకు ఎన్నికలలో పోటీ చేయనున్నారని జనసేన పార్టీ తరుపున రాష్ట్రంలో బరిలో దిగే అభ్యర్థుల విజయం రాష్ట్ర సంక్షేమానికి జయం కలుగుతుందని కొనియాడారు. పవన్ కళ్యాణ్ మరో సుభాష్ చంద్రబోస్ లా అన్ని కులాలలో ఆయన అభిమానులు ఉన్నారు కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలoదరిని కలుపుకొని రాష్ట్రంలోని ప్రజలందరికీ సంపూర్ణ న్యాయం చేసేందుకు మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న జనసేనకు మనం మద్దతు ఇస్తే మన భవిష్యత్తు బంగారు బాట అవుతుందని, కాపు సంక్షేమసేన మూడోవ ఆవిర్భావం దినోత్సవం గా ఇది హరి రామ జోగయ్య ఆకాంక్ష అని తెలియజేశారు. రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఓటరు ఒక్కసారి పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వాలని , అవినీతి దోపిడి దారులైన వైకాపా అధిష్టానం కు ఒక్క ఛాన్స్ ఇచ్చి పూర్తిగా దోపిడీకి గురయ్యారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ అధికార పార్టీ దోపిడీదారులకు మరో అవకాశాన్ని ఇచ్చి మరో తప్పు చేయకూడదని ఓటర్లను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర కుల సంఘ నాయకులు అభ్యర్థించారు.
Comments
Post a Comment