తిరుపతి రూరల్ సిఐటియు మండల కన్వీనర్ గా గండికోట నాగవెంకటేష్ ఏకగ్రీవ ఎన్నిక..!

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి రూరల్ సిఐటియు మండల కన్వీనర్ గా గండికోట నాగవెంకటేష్ ఎన్నికైనట్టు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్ళపల్లి ఎస్వీనగర్ నందు గల నల్లగంగమ్మ గుడి ఆవరణ నందు సిఐటియు మండల మహాసభ జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, సిఐటియు జిల్లా నాయకులు జయచంద్ర, ఐద్వా జిల్లాకార్యదర్శి డాక్టర్ పి. సాయిలక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ, ఆప్కాస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చినబాబు సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ మరియు ఆప్కాస్, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనీ అప్పటి వరకు సమాన పనికి - సమాన వేతనం అమలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10,117 మంది ఉద్యోగులను మాత్రమే రెగ్యులరైజ్‌ చేస్తూ నిర్ణయించడం వలన అతి కొద్ది మంది మాత్రమే రెగ్యులరైజ్ అవుతారని వీరంతా ఏనాటికైనా తాము రెగ్యులర్‌ అవుతామన్న ఆశతో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు. కావున గత ఎన్నికల సందర్భంగా, మరియు ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టైం స్కేల్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

తిరుపతి రూరల్ సిఐటియు మండల నూతన కమిటీ
కన్వీనర్ గా - గండికోట నాగవెంకటేష్, 
కో కన్వీనర్లుగా - మెహనమ్మ (అంగన్వాడీ), సత్యవేలు (గ్యాస్ డెలివరీ బాయ్స్), చెన్నకేశవులు (108 ఉద్యోగుల సంఘం), నీలకఠం (తిరుచానూరు) బీమా మునిరాజా (వెటర్నరీ యూనివర్సిటీ), కమిటీ సభ్యులుగా వరలక్ష్మి, రాఖీ, చంద్రమ్మ, రమా (వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం) భాష (ఆటో) శ్రీనివాసులు (టిటిడి ఫారెస్ట్) బిల్డింగ్, ఆశ, మధ్యాహ్నం భోజన పథకం తదితర రంగాల నుండి కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు