కాన్సర్ వెబ్ అప్లికేషన్ పై తిరుపతి కలెక్టర్ సమీక్ష..!
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టడానికి వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తిచేసామని, ఎంట్రో లాబ్స్ రూపొందించిన కాన్సర్ వెబ్ అప్లికేషన్ మరింత పగడ్భందీగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి సూచించారు.
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమవేశ మందిరంలో కాన్సర్ వెబ్ అప్లికేషన్ రూపొందించిన ఎంట్రో లాబ్స్ ఐటి టీమ్ వెబ్ అప్లికేషన్ వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ పరిశీలించిచారు. స్విమ్స్ , టాటా కాన్సర్ ఆసుపత్రి డాక్టర్లు సూచించిన మేరకు పోర్టల్ నందు మరికొన్ని ఆప్షన్లు ఇవ్వాలని తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలోని ఎం.ఎల్.హెచ్.పి.లకు లాగిన్ వుండాలని, సర్వేలో సమయంలో నమోదు చేసే వారి రోజువారి అలవాట్లు, ఇప్పటికే కాన్సర్ వున్నా వారిని, అనుమానం వున్న, లక్షణాలు వున్న వారిని గుర్తించి నమోదు చేయడం జరగాలని తెలిపారు. పింక్ బస్సులు సచివాలయ పరిధికి వచ్చినప్పుడు పరీక్షలు నిర్వహించి పోర్టల్ లో నమోదు జరగాలని అన్నారు. నమోదు వివరాలు స్విమ్స్ , టాటా కాన్సర్ ఆసుపత్రులకు వెంటనే చేరే విధంగా వుండాలని, ప్రతి ఆసుపత్రికి నోడల్ అధికారిని నియమిం చాలని అన్నారు. నోడల్ అధికారి వెబ్ సైట్ లో నమోదు అయిన వారిని గుర్తించిన వారికి అవసరమైన చికిత్సలు తక్షణం అందాలని అన్నారు. డాస్ బోర్డ్ ఏర్పాటు వుండాలని కలెక్టరేట్ లో మానిటర్ చేయడం జరుగుతుందని, దేశంలోనే ఇలాంటి కాన్సర్ సర్వే మొదటిదని అన్నారు. ఇందులో పేషెంట్ కు ఇస్తున్న మందుల వివరాలు వుండాలని, పేషెంట్ కు ఇంబ్బదికలిగినపుడు వెబ్ పోర్టల్ నందు నమోదు చేస్తే తక్షణ సలహాలు, చికిత్సలు అందించాలని సూచించారు. ఈ సమీక్షలో డి ఎం హెచ్ ఓ శ్రీహరి, కాన్సర్ స్పెషల్ ఆఫీసర్ జయచంద్రా రెడ్డి, ఆంకాలజీ డిపార్ట్ మెంట్ నాగరాజు, గైనకాలజిస్ట్ మాధవి, టాటా ఆసుపత్రి హేమంత్, భారతి, రాస్ నాగరాజు, ప్రాణబందుదాస్, డి పి ఎం ఓ శ్రీనివాస రావు , ఎస్.సి.డి ప్రోగ్రాం ఆఫీసర్ హరినాద్ , డిసి హెచ్ ఎస్ మణి, కిరణ్ నాయక ఎపడ మాలజిస్ట్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment