బొమ్మూరు ప్రజలకు అందుబాటులో సిరి క్లినిక్..!

- అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో
రాజమహేంద్రవరం, త్రిశూల్ న్యూస్ :
బొమ్మూరు ప్రజలకు అందుబాటులో సిరి క్లినిక్ ఏర్పాటు చేసినట్లు సిరి క్లినిక్ డాక్టర్ల బృందం పేర్కొన్నారు. శనివారం సిరి క్లినిక్ ను బొమ్మూరు మెయిన్ రోడ్ లోని, నవభారత్ నగర్ ఏ 1  బ్రాండ్ ఎదురుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొందేసి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మూరు చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలకుఅన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు సిరి క్లినిక్ ను  ప్రారంభించారని తెలిపారు. వైద్యరంగంలో అపారమైన అనుభవం గల గైనకాలజిస్ట్, ఎండి. ఓబిజీవై  వైద్య నిపుణులు డాక్టర్ ఏ. వేణు మాధవి, చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ కె. వి .డి. ప్రసాద్ , జనరల్ ఫిజీషియన్,షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ అనసూరి ప్రియాంక వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. సిరి క్లినిక్ వైద్యులు డాక్టర్ ఏ. వేణు మాధవి మాట్లాడుతూ బొమ్మూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకే ఈ ప్రాంతంలో  సిరి క్లినిక్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కే. వి .డి . ప్రసాద్ మాట్లాడుతూ తను బొమ్మూరు, మురళి కొండ లోనే పుట్టానని ఈ ప్రాంతంలోని నివసించానని తెలిపారు. బొమ్మూరు ప్రజలు వైద్యం కోసం పడుతున్న ఇబ్బందులు తాను చిన్నప్పటి నుంచి తెలుసని అని అన్నారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ దాటితే గాని వైద్య సేవలు అందుబాటులో లేవని ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని తాను డాక్టర్ కోర్స్ చేసి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు బొమ్మూరు ప్రాంతంలోనే హాస్పటల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు సిరి క్లినిక్ లో అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనరల్ మెడిసిన్ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ అనసూరి  ప్రియాంక మాట్లాడుతూ తాను జనరల్ మెడిసిన్ తో పాటు షుగర్ వ్యాధులకు వైద్య సేవలు అందిస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ రమేష్ కిషోర్, డాక్టర్ అనసూరి శ్రీనివాస్, డాక్టర్ అనసూయ పద్మలత, నిరీక్షణ జేమ్స్, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు