సమస్యల సత్వర పరిష్కారానికే గడప గడపకు కార్యక్రమం - ఎమ్మెల్సి భరత్

గుడుపల్లె, త్రిశూల్ న్యూస్ :
స్థానిక సమస్యల సత్వర పరిష్కారానికే గడప గడపకు కార్యక్రమం చేపట్టినట్టు చిత్తూరు జిల్లా వైసిపి అధ్యక్షులు, ఎమ్మెల్సి కేఆర్జె. భరత్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలం బిజిగానిపల్లె గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సి భరత్ ఇంటింటికీ వెళ్లి పథకాల లబ్ధిపై ఆరా తీసి.. ప్రతి కుటుంబానికి జరిగిన మంచిని వివరించారు.
స్థానిక సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి గ్రామస్తులు తీసుకురావడంతో సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వరలక్ష్మి గోపి, జెడ్పీటీసీ డి. క్రిష్ణమూర్తి, గుడుపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో కన్వీనర్ రామమూర్తి ,PACS ఛైర్మన్ క్రిష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ చెండ్రాయన్, మండల ప్రచార కార్యదర్శి వెంకటాచలం, AMC డైరెక్టర్ వెంకటస్వామి, సర్పంచులు గోవిందప్ప, శ్రీనివాసులు, ఎంపీటీసీలు, అధికారులు, మండల నాయకలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు