రేపటి మన కోసం.. ఈ రోజును త్యజించి మనకు స్వేచ్చ నిచ్చిన వారికి ఋణపడి ఉందాం - జిల్లా కలెక్టర్
- ఆగస్టు 9 నుండి 30 వరకు నా భూమి – నా దేశం, నేలతల్లికి నమస్కారం – వీరులకు వందనం ఆజాది కా అమృత్ మహోత్సవ వేడుకలు
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
రేపటి మన కోసం.. ఈ రోజును త్యజించి మనకు స్వేచ్చ నిచ్చిన వారికి ఋణపడి ఉందామని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా బుధవారం నా భూమి – నా దేశం, నేల తల్లికి నమస్కారం – వీరులకు వందనంలో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమం జిల్లా సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్, డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్, చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, మేయర్ అముద, రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ చైర్మన్ కుమార్ రాజా, జడ్పీ వైస్ చైర్ పర్సన్ రమ్య, జడ్పీ మహిళా స్థాయి సంఘ చైర్ పర్సన్ భారతిలతో పాటు జెడ్పి సిఈఓ ప్రభాకర్ రెడ్డి, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రదీప్, సైనిక వెల్ఫేర్ అధికారి విజయ్ శంకర్ రెడ్డి, స్వాతంత్ర్య సమర యోధులు టి.సి. రాజన్ లతో పాటు సంబంధింత అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో భాగంగా మాతృ దేశ మట్టికి కృతజ్ఞత తెలుపుతూ శిలా ఫలకంఆవిష్కరించారు.శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ పంచప్రాణ్ ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా శిలాఫలకం ఏర్పాటు చేసుకోవడం, మొక్కలు నాటడం జరిగిందని, స్వాతంత్ర్య సమరయోధుల సమక్షం లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం గొప్ప విషయం అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఎంతో మంది త్యాగధనులను ఈ సందర్భంగా స్మరించుకోవాలని తెలిపారు. ఆగస్టు 9 నుండి 30 వరకు నా భూమి – నా దేశం,నేల తల్లికి నమస్కారం – వీరులకు వందనం ఆజాది కా అమృత్ మహోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు.
Comments
Post a Comment