అంగళ్లు, తంబళ్లపల్లె, పుంగనూరు ఘటనలకు వైసిపి వారే బాధ్యులు - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

- వైసిపి నేతల ఒత్తిడితోనే తమ పై అక్రమ పోలీసు కేసులు

- టిడిపి రాయచోటి నియోజకవర్గ నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపణ
రాయచోటి, త్రిశూల్ న్యూస్ :
అంగళ్లు, తంబళ్లపల్లె, పుంగనూరు ల్లో చోటు చేసుకున్న సంఘటనలకు వైసిపి వారే బాధ్యులని.. వారిని వదిలేసి టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు తనపై తమ పార్టీ నేతలు, కార్యకర్తల పై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం దారుణమని, వైసిపి నేతల బత్తిడి మేరకే పోలీసులు తమ పై అక్రమ కేసులు బనాయించారంటూ తెలుగుదేశం పార్టీ రాయచోటి నియోజకవర్గ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. ఈనెల 4వ తేదీన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని తంబళ్లపల్లె, అంగళ్లు, పుంగనూరు ప్రాంతాల్లోని ప్రాజెక్టులను పరిశీలించేందుకు వచ్చిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిలు కలిసి అధికార దర్పంతో పోలీసులను అడ్డుపెట్టుకొని వైసిపి గూంఢాలతో పోలీసుల సమక్షంలోనే ఎందరో టిడిపి కార్యకర్తలు, నాయకులపై మారణాయుధాలతో దాడులు చేయించి విధ్వంసం సృష్టించారంటూ ఆయన ఆరోపించారు. నిందితులను వదిలే వైసిపి గూంఢాల చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన టిడిపి కార్యకర్తలు, నాయకులు పైనే అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక, రాక్షస పాలన సాగుతుందని ఆయన ఆరోపించారు. తనపైనే ఇప్పటి వరకు రెండు అక్రమ కేసులు బనాయించారని తాము కేసులకు భయపడే ప్రసక్తే లేదని న్యాయ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించరాదని ఎప్పటికి ఈ వైసిపి పాలన ఉండదని ఆయన హితవు పలికారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు