రూ.800 కోట్లతో అనంత అభివృద్ధి - ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

– టీడీపీ పాలనలో అంతా మాటల గారడీ

– వైసీపీ వచ్చాక అనంత రూపురేఖలు మార్చాం

– రోడ్లు, డ్రెయినేజీలకు అత్యధిక ప్రాధాన్యత

– అనంత అభివృద్ధిపై సీఎం జగన్‌ ప్రత్యేక చొరవ

– ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం
 
– 21వ డివిజన్‌లో రోడ్డు పనులకు భూమిపూజ 

అనంతపురం, త్రిశూల్ న్యూస్ :
  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురంలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలన కేవలం మాటల గారడీగా మారితే.. వైసీపీ హయాంలో అనంతపురం రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు. శనివారం నగరంలోని 21వ డివిజన్‌లో రూ.24 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా అనంతపురంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ కార్పొరేషన్‌ పాలకవర్గం అభివృద్ధిని పరుగుపెట్టిస్తోందని తెలిపారు. ప్రధాన రహదారులు, బ్రిడ్జిలు, రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. గత పాలకులు బలహీనవర్గాలు నివాసం ఉండే ప్రాంతాలను నిర్లక్ష్యం చేశాయని అన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ, అప్పటి పాలకవర్గం నగర అభివృద్ధి విషయంలో వైఫల్యం చెందిందని తెలిపారు. వైసీపీ వచ్చాక మునిసిపల్‌ జనరల్‌ ఫండ్స్, 14, 15 ఫైనాన్స్‌ ఇతర నిధులు సుమారు రూ.100 కోట్లు వెచ్చించి డివిజన్లలో అభివృద్ధి చేశామన్నారు. 2019 ఎన్నికల సమయంలో తాము ప్రచారానికి వెళ్తే ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిచ్చేవని, కానీ నేడు అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. అనంతపురం రూపురేఖలు మారుస్తున్నామన్నారు. అనంతపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు కూడా చెప్పలేని పరిస్థితి ఉందని అన్నారు. ప్రత్యేకంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం నియోజకవర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 14 నియోజకవర్గాలకు స్పెషల్‌ ఫండ్స్‌ వస్తే అందులో అనంతపురానికి రూ.25 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. గత పాలకులు అంబేడ్కర్‌ నగర్‌ను తీవ్ర నిర్లక్ష్యం చేశారన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అంటే ఇదీ అనేలా ఒక్క డివిజన్‌లోనే రూ.1.75 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఫయాజ్, వక్ఫ్‌బోర్డు మెంబర్‌ ఖమర్తాజ్, కార్పొరేటర్లు సాకే చంద్రలేఖ, లీలావతి, లావణ్య, సైఫుల్లాబేగ్, బాబా ఫకృద్దీన్, ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు సాకే కుళ్లాయిస్వామి, వైసీపీ నాయకులు చంద్రశేఖర్‌ (చిన్నా), శోభన్, సురేష్, లక్ష్మి, జాఫర్, అజీమ్‌బాషా, ఇలియాజ్, జిలాన్, హిద్దు, వేణు, ముత్యాలప్ప, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు