పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది - ఎన్ఎస్ యుఐ నాయకులు మంజునాథ్

అనంతపురం, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించి చాలు అనుకున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీరు గుడిబండల మారింది అని స్థానిక రాప్తాడు మండలంలో అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఈ సందర్బంగా ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ ఒక్క అనంతపురం జేఎన్టీయూ పరిధిలోనే 40 శాతం సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.. వాటిని తృతీయ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయకుండా స్పాట్ అడ్మిషన్స్ డేటా వివరాలు సేకరించి ఖాళీ సీట్లతో కళాశాల ద్వారా వ్యాపారం చేయించాలని చూస్తోందన్నారు. విద్యార్థుల పట్ల వైసిపి ప్రభుత్వం అడుగడుగునా అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభంలో కౌన్సిలింగ్ చేపట్టి సకాలంలో ప్రవేశాలు కల్పించిన రాష్ట్రం ఉన్నత విద్యా మండలి ఐదు నెలలు అయినా కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయడం చేయలేదని తెలిపారు. మూడు దపాలు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ ప్రక్రియను రెండుసార్లు నిర్వహించి చేతులెత్తేసింది.. త్వరి తగతిన తృతీయ కౌన్సిలింగ్ నిర్వహించి. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండు చేసారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే జేఎన్టీయూ కళాశాల ఆవరణంలో ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేస్తామని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి, మల్లికార్జున, శివ, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు