పుస్తకం.. ఓ మంచి నేస్తం - ఎమ్మెల్యే అనంత

– పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం
– ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ
అనంతపురం, త్రిశూల్ న్యూస్ :
 
మంచి పుస్తకాన్ని కొనుక్కుని చదువుతుంటే గొప్ప స్నేహితుడు దొరికినంత అనుభూతి కలుగుతుందని, పుస్తకాలు మంచి నేస్తాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అందుకే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని కందుకూరు వీరేశలింగం పంతులు అన్నారని గుర్తు చేశారు. మంగళవారం అనంతపురం నగరంలోని జిల్లా గ్రంథాలయంలో బాలల దినోత్సవంతో పాటు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ మంచి పుస్తకాలతో మానసిక వికాసం కలుగుతుందన్నారు. ఈరోజు దేశం ఇంతగా అభివృద్ధి చెందిందంటే దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వేసిన పునాదులే కారణమని చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందిస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరూ చదువుకునేందుకు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. చాలా మంది పిల్లలు ఆండ్రాయిడ్‌ ఫోన్లకు పరిమితం అవుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. దీని వల్ల మానసికంగా సమస్యలు కూడా వస్తాయని చెప్పారు. పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గ్రంధాలయం అభివృద్ధి కి గ్రంధాలయ చైర్పర్సన్ ఉమాదేవి ఎంతో శ్రమిస్తోందని అభినందించారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ ఉమాదేవి, మేయర్‌ మహమ్మద్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎల్‌ఎం మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు