డివిజనుల్లో సమస్యలకు సత్వరమే పరిష్కారం అందిస్తాం..!

- కౌన్సిల్ సమావేశంలో మేయర్ స్రవంతి జయవర్ధన్
నెల్లూరు, త్రిశూల్ న్యూస్:
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో స్థానిక సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులతో పర్యవేక్షిస్తామని కార్పొరేషన్ మేయర్ స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. మేయర్ స్రవంతి జయవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దాదాపుగా 62 తీర్మానాలను అజెండాగా, 33 తీర్మానాలను టేబుల్ అజెండాగా సమర్పించారు. నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా విధి నిర్వహణలోని కార్మికుల సహజ మరణానికి రూ. 2 లక్షలు, ప్రమాద మరణానికి రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని కుటుంబానికి అందించే తీర్మానానికి ఆమోదించామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్న పర్మినెంట్ ఉద్యోగ భద్రత అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు. డి.కే డబ్ల్యూ కాలేజ్ నుండి సారాయి అంగడి సెంటర్ మధ్యలో ఏ.పి.జే అబ్దుల్ కలాం విగ్రహం, పొదలకూరు రోడ్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. నగర వ్యాప్తంగా పలు డివిజన్లలో నూతన సి.సి.రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఇ-ప్రొక్యూర్మెంట్ పద్దతిలో టెండర్లు పిలిచేందుకు ఆమోదించారు. పారిశుధ్య కార్మికులకు అదనంగా కావలసిన శానిటరీ ఉపకరణాలు కొరకు ఆమోదం తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో పాటు నగర ప్రజలందరి సహకారంతో నెల్లూరు నగర పాలక సంస్థ ఉన్నతి సాధించేలా సమన్వయంగా కృషి చేస్తామని మేయర్ ఆకాంక్షించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు తమ డివిజన్ల పరిధిలో ప్రస్తావించిన పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైను కాలువల పూడికతీత, దోమల నిర్మూలన, కుక్కలు, పందులు, పశువుల నియంత్రణతో పాటు స్థానిక సమస్యలను, వివిధ అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని మేయర్ ఆదేశించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ వికాస్ మర్మత్, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


నెల్లూరు నగర కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత

       నెల్లూరు నగర కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం సందర్బంగా నెల్లూరు నగర కార్పొరేషన్ లో 54 వార్డులకు గాను 54 వార్డులు వైసిపి పార్టీ గెలిచిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో కార్పొరేషన్ లో పనిచేసే కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులును, ఇతర కొన్ని విబాగా కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ పారిశుధ్య కార్మికులును రెగ్యులర్ చేయలేదని కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేసిన కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నెల్లూరు నగర కార్పొరేషన్ లో జరుగుతున్న కౌన్సిల్ సమావేశంలో పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేసే విధంగా కౌన్సిల్ లో చర్యలు తీసుకోవాలని పారిశుధ్య కార్మికులు ఇతర విభాగం కార్మికులు సిపిఎం, సీపీఐ, సీఐటీయూ నాయకులతో కలిసి నెల్లూరు నగర కార్పొరేషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు