నిర్మలమైన హృదయమే భగవంతుని నిలయం - డాక్టర్ మల్లు వేంకటరెడ్డి
కర్నూలు, త్రిశూల్ న్యూస్ :
గోవిందుడు అందరివాడని, నిర్మలమైన హృదయమే భగవంతుని నిలయమని, అటువంటి ఇతివృత్తాన్ని తెలుపుటకే తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ మంగళ కైశిక ద్వాదశి కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే హిందూ ధర్మ ప్రచార మండలి సభ్యులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం పొన్నాపురం ఎస్సీ కాలనీలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు జరుగిన మంగళకైశిక ద్వాదశి కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పొన్నాపురంతో పాటు ఆళ్ళగడ్డ ఆదర్శ నగర్ కాలనీలోన శ్రీరామాలయం, కల్లూరు మండలం పర్ల గ్రామంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం, కోడుమూరు మండలం, వర్కూరు గ్రామంలోని శ్రీ రామాలయం నందు మంగళ కైశిక ద్వాదశి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా అభిషేకం, షోడశోపచార పూజ, విశేషాలంకరణ, నగర సంకీర్తనతోపాటు, భక్తులందరికీ తీర్ధప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆయా ఆలయ కమిటీ సభ్యులు, భహభజన బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment