శ్రీకాళహస్తి ప్రాంతీయ వైద్యశాలలో క్యాంటీన్ ప్రారంభించండి..!
శ్రీకాళహస్తి, శూల్ న్యూస్:
శ్రీకాళహస్తి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో క్యాంటీన్ వెంటనే ప్రారంభించాలని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను రాష్ట్ర ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి హరీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ప్రతినిధుల బృందం శనివారం ప్రాంతీయ వైద్యశాఖ పర్యవేక్షకులు డాక్టర్ విజయలక్ష్మిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో క్యాంటీన్ నిర్మాణం పూర్తయి ఐదు నెలలు దాటుతోందన్నారు. అయినా దానిని ప్రారంభించడానికి వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. క్యాంటీన్ అందుబాటులో లేకపోవడంతో వైద్యశాలకు వచ్చే రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యశాల ఆవరణలో క్యాంటీన్ అందుబాటులో లేకపోవడం వలన రోగులు బయట హోటళ్లను ఆశ్రయించవలసి వస్తోందన్నారు. బయట హోటళ్లలో ధరలు విపరీతంగా ఉండటంతో పేద రోగులు భారం మోయలేక పోతున్నారన్నారు. పేద రోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా క్యాంటీన్ ప్రారంభించాలని హరీష్ రెడ్డి కోరారు. ఈ సమస్య శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి దృష్టికి చరవాణి ద్వారా తెలియపరచడం జరిగిందని ఆయన రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి రోగులకు అందుబాటులో ఉండే విధంగా క్యాంటీన్ ప్రారంభించి విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వీలైనంత త్వరగా వైద్యశాల ఆవరణలో క్యాంటీన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను డిప్యూటీ ఛైర్మన్ యల్లంపాటి కోటేశ్వరబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవగుంట భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment