జర్నలిస్టుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం - తిరుపతి ప్రెస్ క్లబ్ సెక్రటరీ బాలచంద్ర
- మూడు సెంట్లు స్థలం కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదించడం హర్షనీయం - జాప్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి
-కృతజ్ఞత తెలుపుతూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
జర్నలిస్టుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలకు ఆమోదం తెలపడం శుభ పరిణామం అని తిరుపతి ప్రెస్ క్లబ్ సెక్రటరీ బాలచంద్ర పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో శనివారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వివిధ జర్నలిస్ట్ సంఘాల నేతల ఆధ్వర్యంలో సీఎం కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సెక్రటరీ బాలచంద్ర మాట్లాడుతూ జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలపడంతో జర్నలిస్టుల కుటుంబాల్లో ధీపావళి, సంక్రాంతి పండుగలను ముందే సీఎం తీసుకొచ్చారని అన్నారు. జర్నలిస్టులకు సీఎం సంక్రాంతి గిఫ్ట్ ను ప్రకటించారన్నారు. 15 ఏళ్ల తర్వాత జర్నలిస్టుల కల సాకారం అవుతుండటం యావత్ జర్నలిస్టుల కళ్ళల్లో ఆనందం నెలకొందన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేంధర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇచ్చిన మాటకు కట్టుబడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తామని మంత్రి మండలిలో నిర్ణయించిన సీఎంకి ధన్యవాదాలు తెలియజేసారు. 2008 లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తే, ఇప్పుడు ఆయన తనయుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బాసరప్తంగా జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. సొంత ఇంటి స్థలం సాధించడం అనేది జర్నలిస్టులకు చిరకాల స్వప్నం అన్నారు. ఆ స్వప్నాన్ని సాకారం చేసిన సీఎంకు ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాప్ జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్, జర్నలిస్ట్ నాయకులు సునీల్, కుమార్, గాంధీ, మోహన్ రావు, మహేష్, తిరుపాల్, రాజు, లావణ్య కుమార్, సుబ్బు, భూమిరెడ్డి నరేష్, శశి, వేణు, మూర్తి, కృష్ణ, హరి, గౌడ్, ప్రవీణ్, ప్రసాద్, విజయ్, లోకనాధ్ రెడ్డి, పీటర్, పధ్మనాభం, రమణా రెడ్డి, నాగార్జున్, చెంచెయ్య, మణి, సుధీర్, ఉమాపతి, కృష్ణమూర్తి, శ్రీనివాసాచారి, స్మార్ట్ బుజ్జి, మురళీ, ప్రశాంత్, రోషన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment