జనవరి నాటికి టిడ్కో గృహాలను అందించండి - ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అల్లీపురంలోని టిడ్కో గృహాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి వచ్చే ఏడాది జనవరి నాటికి లబ్ధిదారులకు అందజేయాలని పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. కార్పొరేషన్ కార్యాలయాన్ని ఎంపీ శుక్రవారం సందర్శించి మేయర్ స్రవంతి, కమిషనర్ వికాస్ మర్మత్ లతో వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎం.పీ, మేయర్ మాట్లాడుతూ టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఎంపీ, మేయర్ ల సూచనల మేరకు టిడ్కో గృహ సముదాయాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, లబ్ధిదారులకు త్వరితగతిన అందజేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు లేని కట్టడాలను సచివాలయాల వారీగా గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలోని గుర్తించిన రోడ్ల మరమ్మతు పనులను చేపట్టి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ వివిధ డివిజనల్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు