దళిత యువకుని నోటిలో చెప్పు పెట్టి కొట్టిన వారిని శిక్షించాలి..!
పలమనేరు, త్రిశూల్ న్యూస్:
గుజరాత్ రాష్ట్రం మోర్బి ప్రాంతములో దళిత యువకుని నోటిలో చెప్పు పెట్టి అతి దారుణంగా కొట్టి అవమానపరిచిన విభూతి పటేల్, ఆమె సోదరుని పై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ అభిప్రాయ వ్యక్తం చేసింది. అందులో భాగంగా శనివారం పలమనేరు పట్టణంలో గల జాతీయ మానవ హక్కుల కార్యాలయంలో డివిజన్ నాయకులు మనీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు డివి మునిరత్నం, వేలాయుధం, పార్థసారథి మాట్లాడుతూ గుజరాత్, మోర్బి ప్రాంతంలో విభూతి పటేల్ కు చెందిన ఓ ప్రైవేటు టైల్స్ సంస్థలో నితీష్ దాల్సానియా అనే దళిత యువకుడు కూలి పనికి నియమితుడయ్యాడని 16 రోజులు పనిచేస్తుండగా అనుకోకుండా యజమాని పనిలో నుండి తీసివేయడంతో చేసిన రోజులకు కూలి డబ్బులు ఇవ్వమని అడిగితే జీర్ణించుకోలేని విభూతి పటేల్ తన సోదరిని సహాయముతో క్రింద నుండి మేడ పైకి లాక్కెళ్ళి నోటిలో చెప్పు పెట్టి దారుణంగా కొట్టడం బాధాకరమన్నారు. ఇక నిజ స్వరూపం తెలిస్తే కేసులో ఇరుక్కుంటామని బాధితుని చేతనే డబ్బులు దొంగతనానికి వచ్చినట్లు చెప్పమని బలవంతంగా ఒప్పించిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయాలని ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, పాండురంగాచారి, సరస్వతి, హేమలత, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment