ఐ ప్యాక్ (ప్రశాంత్ కిషోర్ )వివరణతో వైసీపీలో ఆందోళన...?
- ముందస్తు జాగ్రత్తగా తటస్థంగా మండల ఎంపీపీ, జడ్పీటీసీలు..?
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఇంతవరకు వాళ్ళూ వీళ్ళూ చెపితే ఏమోలే వాళ్ళూ వీళ్ళూ చెప్పినవి మనం ఎందుకు నమ్మాలి అని సరిపెట్టుకున్న వైసీపే నేతలకు ఇప్పడు ప్రశాంత్ కిశోరే చేతులు ఎత్తేయడంతో నిజం ఏమిటో తెలిసి వచ్చింది. ఓటమి తధ్యమనే సత్యం బోధపడింది. అవును. ఐ ప్యాక్ (ప్రశాంత్ కిషోర్) నిర్వహించిన తాజా సర్వే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎటు మొగ్గుచూతున్నారో తేల్చి చెప్పేసింది. ఏపీ ఓటరు పల్స్ ఏమిటో నిగ్గుతేల్చింది. ఇప్పటికిప్పుదు కాదు ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఏపీలో అధికార వైసీపీకి ఓటమి ఎదురు దెబ్బ తప్పదని అదికూడా అలాంటి ఇలాంటి ఎదురుదెబ్బ కాదు దిమ్మతిరిగే ఎదురదెబ్బ తప్పదని ఐ ప్యాక్ తాజా సర్వే తేల్చి చెప్పింది.
నిజానికి సర్వేలతో పనిలేకుండానే వైసీపీ ఓటమి అనివార్యమనే నిజం ఆ పార్టీలో ఒక్కరికి మినహా అందరికీ ఇప్పటికే తెలిసిపోయింది. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఏమిటన్నది అందరికంటే వైసీపీ నాయకులకే కొంచెం ఏమిటి.. చాలా ఎక్కువ తెలుసు. అయితే మీటలు నొక్కితే ఓట్లు రాలతాయనే భ్రమల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి సర్వేల పేరిట తనను తాను మోసం చేసుకుంటూ, ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులనూ మోసం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పడు, ఐప్యాక్ లేటెస్ట్ సర్వేతో వైసీపీ నాయకులకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న పీకే తాజ్ సర్వే పై వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
పీకే సర్వేలో షాకింగ్ వివరాలు..?
ఇతకీ ఈ సర్వే ఏమి చేపుతోందంటే, తెలుగుదేశశం, జనసేన కలిసి పోటీ చేస్తే ఈ కూటమికి ఏకంగా 144 స్థానాలు దక్కుతాయని స్పష్టం చేసింది. మరో వంక వై నాట్ ..175 అంటున్న జగన్ రెడ్డికి గరిష్టంగా 31 సీట్లు మించి వచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఇంతవరకు మీటల మీద పెట్టుకున్న ఆశలు పనిచేయని పరిస్థితి రాష్ట్రంలో ఉందనీ, సంక్షేమ పథకాలు జగన్‌ని కాపాడలేకపోతున్నాయని ప్రశాంత్ కిశోర్ సర్వే తేల్చిచెప్పింది. నాలుగేళ్లుగా రాష్ట్రంలో పడకేసిన అభివృద్ధి, కనీసం రాజధాని ఏదో కూడా తేల్చుకోలేని స్థితి , పోలవరం ఆగిపోవడం లాంటి అంశాలు జగన్‌కి శాపంగా మారాయని పీకే సర్వేలో తేలింది. ఇక చంద్రబాబు అరెస్ట్ ప్రభావం కూడా వైసీపీ అవకాశాలను గట్టిగా దెబ్బతీసిందని ప్రశాంత్ కిశోర్ బృందం తేల్చి చెప్పింది.
చంద్రబాబు అరెస్ట్ ప్రభావం..?
చంద్రబాబు అరెస్ట్ తర్వాత దేశ విదేశాల్లో ఆయనకు లభిస్తున్న మద్దతు. వ్యక్తమవుతున్న సానుభూతి, అన్నిటినీ మించి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ మరో సారో మరింతగా వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల జగన్ రెడ్డి అరాచక పాలనలో కట్టు తప్పి, ఆగాధంలోకి కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలు ఎక్కించాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి తీరాలన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తమౌతోందని ఈ సర్వే పేర్కొంది. ఇటు రాజధానిపై జగన్ నాలుగేళ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా వైసీపీ పుట్టి ముంచనుందని పేర్కొంది. సీపీఎస్ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి యూ టర్న్ తీసుకున్న జగన్‌పై ఉద్యోగులు ఆవేశంతో రగిలిపోతున్నారు. నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు.. వారి ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి.ఇలా అన్ని వర్గాల్లో కట్టలు తెంచుకుంటున్న అసంతృప్తిని పసిగట్టిన పీకే ..ఐ ప్యాక్ ప్యాకింగ్ కు రెడీ అయిపోయిందని అంటున్నారు.
ఇలా అన్ని రంగాలు కుదేలవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ప్రశాంత్ కిషోర్ సర్వే తేల్చిందనీ.. తమకు ఓటమి ఖాయమన్న విషయం ఆ సర్వేతో సంబంధం లేకుండానే తెలిసిపోయిందనీ వైసీపీ నాయకులే అంటున్నారు.
Comments
Post a Comment