మైనర్ బాలికకు సంపూర్ణ న్యాయం చేయాలి - ప్రజా సంఘాలు డిమాండు

- 5 రోజుల నుంచి పోరాటం చేస్తున్న ఇంతవరకు చట్టపరమైన సెక్షన్లు పెట్టలేదు

- జిల్లాలో మంత్రి ఉష శ్రీ చరణ్ ఉన్న ఇంతవరకు పరామర్శించిన పాపాన పోలేదు

- డిప్యూటీ సీఎం అంజద్ భాషా పై ఫైరైన అఖిల పక్షాలు, ప్రజాసంఘ నాయకులు
అనంతపురం, త్రిశూల్ న్యూస్:
మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దంపతులను వెంటనే శిక్షించాలని అఖిలపక్షం నాయకులు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సప్తగిరి సర్కిల్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి ముక్తార్, కాంగ్రెస్ నాయకులు ఇమామ్, ముస్లిం మైనార్టీ సంఘ నాయకులు నిజాం, ఎంఐఎం నాయకులు శ్యామ్, యాంటీ కరప్షన్ ఫోర్స్ సరస్వతిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 సంవత్సరాల మైనర్ బాలికపై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దంపతులు క్రూరాతి క్రూరంగా వ్యవహరించారని మండిపడ్డారు. మానవ సమాజం తలదించుకునే విధంగా దుశ్చర్యకు పాల్పడిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దంపతులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. రాజకీయ లబ్దికోసం కాకుండా మైనర్ బాలికకు జరిగిన అన్యాయం పై పోరాడుతున్నామన్నారు. మైనర్ బాలికకు కార్పొరేట్ వైద్యంతో పాటు రూ. 50 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్షం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కాజా, హెల్పింగ్ హాండ్స్ షబ్బీర్, ఎంఐఎం నాయకులు దాదు, మసూద్, యాంటీ కరప్షన్ ఫోర్స్ షఫీ, టిడిపి ముస్లిం మైనార్టీ సిటీ అధ్యక్షులు హజీజ్, హ్యూమన్ రైట్స్ షఫీ జనసేన నగర ప్రధాన కార్యదర్శిలు దరాజ్ భాష, హుస్సేన్, నాయకులు హీద్దు తదితరులు పాల్గొనడం జరిగింది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు