బీసీలకు న్యాయం చేసింది సీఎం జగన్ ఒక్కడే - మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

- వడ్డెరలకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్టసభల్లో పంపించారు
- వైస్సార్సీపీ ప్రభుత్వంలోనే సామాజిక న్యాయం
- పార్టీ లో చేరిన వారికి సముచిత స్థానం

- ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ, త్రిశూల్ న్యూస్ :
వెనుకబడిన వర్గాలుగా ఉన్న బీసీలకు అన్ని విధాలా న్యాయం చేసింది సీఎం జగన్ ఒక్కడేనని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. బీసీలు ఇవాళ కింది స్థాయి పదవుల నుంచి రాజ్యసభ పదవుల వరకు పొందారంటే అందుకు కారణం జగన్ అని ఆయన స్పష్టం చేశారు. ఉరవకొండ పట్టణానికి, బూదగవి గ్రామానికి చెందిన 30 వడ్డెరల కుటుంబాలు బూదగవి వడ్డే భీమేష్ బాబు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరారు. పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విశ్వ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా గతంలో ఏ పార్టీ ఇవ్వని విదంగా వడ్డెరలకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.పార్టీలో చేరిన వారు కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రతిఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ లో చేరిన ఉరవకొండకు చెందిన చిరంజీవి, ప్రసాద్, నాగరాజు,అమరేష్,హరి, ప్రసాద్, బూదగవి గ్రామానికి కుమారస్వామి, ఎర్రిస్వామి, గురుస్వామి, చంటి, చిరంజీవి, రామంజినమ్మ, ధనలక్ష్మి, భీమలింగమ్మ, పద్మావతి, జయమ్మ తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైస్సార్సీపీ లో చేరినట్లు తెలిపారు. ఆయన ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఏర్పడిందని చెప్పారు. ఉరవకొండ ఇంచార్జి విశ్వేశ్వరరెడ్డి కూడా నియోజకవర్గంలో అన్ని పదవుల్లోను సామాజిక న్యాయం పాటిస్తూ బిసిలకు పెద్దపీఠ వేశారని అందుకే పార్టీ లో చేరినట్లు తెలిపారు.వైస్సార్సీపీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, మండల సమన్వయకర్త ఓబన్న, విడపనకల్లు జడ్పిటిసీ హనుమంతు, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందు,పట్టణ అధ్యక్షుడు ఏసీ ఎర్రిస్వామి,మాజీ ఎంపీపీ చంద్రమ్మ, జేసిఎస్ కన్వీనర్ ఆసిఫ్,మాజీ ఎంపిటిసి ముస్టురు వడ్డే లాలుస్వామి, నాయకులు బూదగవి శ్రీనివాసులు, జనార్దనపల్లి మల్లికార్జున, ప్రసాద్ నాయక్, మోపిడి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు