మైనార్టీలను మోసం చేసిన జగన్ రెడ్డిని ఇంటికి పంపాలి..!
- ఉమ్మడి చిత్తూరు జిల్లా మైనార్టీల ఆత్మీయ సదస్సులో నేతలు పిలుపు
మదనపల్లి, త్రిశూల్ న్యూస్:
వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లిం మైనార్టీల పైన అనేకమైన దాడులు, అక్రమంగా కేసులు, మైనార్టీ భూములన్ని ఆక్రమించుకోవడం తోపాటు అనేకమైన క్రిమినల్ కేసులు పెట్టి ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఈ ప్రభుత్వం కష్యా సాధింపు చర్యలు చేస్తుందని జోన్ 4 కమిటీ సభ్యులు అమీర్ బాబు ఆరోపించారు. శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా మైనార్టీల ఆత్మీయ సదస్సు కార్యక్రమం మదనపల్లిలోని ఎన్.వి.ఆర్ కళ్యాణమండపం నందు మైనార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజుల ఖాదర్బాషా, ముస్తాక్ అహ్మద్, ముక్తియర్ షేక్ షా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి ఇన్చార్జి దుమ్మలపాటి రమేష్, మాజీ శాసనసభ్యులు షాజహాన్ భాష హాజరయ్యారు. ఈ సందర్బంగా అమీర్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి అని మైనార్టీలపై కపట ప్రేమ వలకబోస్తున్నాడని తీవ్రంగా దుయ్యబట్టారు. ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో ముస్లింలు లేరని, తటస్తులు కూడా ఈ రాష్ట్రానికి దశా దిశా నిర్దేశించే నాయకుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమని తపించే నాయకుడు చంద్రబాబు నాయుడేనని అన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లిం మైనారిటీలపై గుండాయిజం, రౌడీయిజం ఎక్కువ అయ్యిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముస్లింలకు అందాల్సిన సంక్షేమ పథకాలు గాని, రంజాన్ తోఫా, రిజర్వేషన్లు అన్నిటినీ తుంగలో తొక్కడం జరిగినదన్నారు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీ సోదరులకు సంక్షేమ పథకాలు గాని, రిజర్వేషన్లు గాని, సబ్సిడీ సంబంధించిన పథకాలు గాని, రంజాన్ తోఫా, మరియు ముస్లిం సోదరీ సోదరీమణులకు పెళ్లి కానుక కింద రూ. 50000 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీ సోదరులకు చట్టసభలలో సముచిత స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి నాసర్ అలీ, 39 వ డివిజన్ సీనియర్ నాయకులు ఇలియాస్, మృత్యుంజయకుంట నూరు బాషా, చాంద్ బాషా , ముస్తాక్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment