జగన్ రెడ్డి అరాచకాలను అంతమొందించేందుకే లోకేష్ శంఖారావం - బత్యాల
- యాత్ర - 2 సినిమాకు టికెట్లు అమ్మాలని కలెక్టర్లకు ఎస్పీలకు ఆదేశాలు ఇవ్వడం దారుణం
రాజంపేట, త్రిశూల్ న్యూస్ :
సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అరాచకాలను అంతమొందించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపటి నుంచి శంఖారావం ప్రారంభిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు తెలిపారు. శనివారం రాజంపేట పట్టణంలోని బత్యాల భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఈ శంఖారావం ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు కొనసాగుతూ యువగళం పాదయాత్రలో కవర్ చేయనటువంటి నియోజకవర్గాల్లో పర్యటించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక కిరాతక పైసాచాన్ని ప్రజలకు వివరిస్తూ శంఖారావం ఉండబోతుందన్నారు. అలనాడు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పట్టిన శంఖారావమే ధర్మం గెలిచేదానికి అధర్మం ఓడిపోయేదానికి ఉపయోగపడిందని వివరించారు. ఈ రాష్ట్రంలో అభ్యర్థులను సైతం కొట్టే కాడికి వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. నిన్న కడపలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి , ఇన్చార్జి మాధవరెడ్డిలతో పాటు అతని కుటుంబసభ్యులు, పార్టీ క్యాడర్ మీద కత్తులు తీసుకొని వచ్చి దాడులు చేయడం, మొన్న వైసీపీ ఎర్రదొంగలు కానిస్టేబుల్ గణేష్ ను వాహనంతో ఢీ కొట్టి చంపేయడం చూస్తుంటే రాష్ట్రంలో పోలీసులకే భద్రత లేకుండా పోయిందన్నారు. పోలీసులకే భద్రత లేనప్పుడు ఇక ప్రజలకు ఏమి భద్రత ఉంటుందని దుయ్యపట్టారు. కానిస్టేబుల్ ను వాహనంతో ఢీ కొట్టి చంపినా ఇంకా కొంతమంది పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతులు ఏ విధంగా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పారు. వైసిపి సిద్ధం అనే కార్యక్రమానికి కటౌట్లు బ్యానర్ల కోసం 800 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఆరోపించారు. గతంలో ఉపాధ్యాయులు ప్రభుత్వ అధికారుల ద్వారా కరోనా సమయంలో మద్యం అమ్మకాలు జరిపించి, ఇప్పుడు ప్రభుత్వ సొమ్ముతో యాత్ర-2 సినిమాను తీసి ఆ సినిమాను ప్రజలందరికీ చూపించాలని కలెక్టర్లు,ఎస్పీ లకు ప్రత్యేక సర్కులర్లు జారీ చేసి వారిని వేదించడం సిగ్గుచేటు అన్నారు. రెండు నెలలలో మా ప్రభుత్వం రాబోతుందని జగన్మోహన్ రెడ్డి తిన్నదంతా కక్కించి బెయిల్ మీద ఉన్న జైలు పక్షిని మళ్లీ జైలుకే పంపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment