నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు..!

- వెలిగల్లు వద్ద 1500 లీటర్ల తుమ్మచెక్క బెల్లం ఊట ధ్వంసం
తంబళ్లపల్లె, త్రిశూల్ న్యూస్ :
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పెద్దమండెం మండలం, వెలిగల్లు వద్ద పోలీసులు శనివారం నాటు నారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులు డీఎస్పీ కేశప్ప ఆదేశాలతో ఎస్ఐ వెంకటేష్ తన సిబ్బందితో కలసి వెళ్లి వెలిగల్లుకు సమీపంలోని గుట్టకింద వాగులో పెద్దఎత్తున నాటు సారా తయారీ డంపును గుర్తించారు. వెంటనే బట్టీలను పగలగొట్టి 1500 వందల లీటర్ల తుమ్మ చెక్క బెల్లం ఊటను ధ్వంసంచేసి, కొంత నాటు సారాను కూడా సీజ్ చేశారు. సార తయారు చేస్తున్న వ్యక్తి పరార్ కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు..

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు

ప్రియుడు మోజులో పడి కన్న తండ్రిని కడతేర్చిన కసాయి కూతురు..!