అక్రమ సంబదానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య..!

- కట్టుకున్న భర్తను, ప్రియుడు, తన తండ్రితో కలసి హతమార్చిన వైనం

- పోలీసుల విచారణలో నివ్వెర పోయే నిజాలు
మదనపల్లి, త్రిశూల్ న్యూస్ :
అన్నమయ్య జిల్లాలో ఒక ఇల్లాలు తాళి కట్టిన భర్త తన ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉన్నాడనుకుంది. పక్కా ప్లాన్‌తో అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసింది. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించడంతో అసలు విషయం బయటకొచ్చింది. మదనపల్లికి చెందిన శ్రీనివాసులు దొనబైలుకు చెందిన గీతను 4 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని చిన్న దొనబైలులో కాపురం పెట్టాడు. గత నెల 25 నుంచి భర్త శ్రీనివాసులు కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య గీత. చిన్న దొనబైలుకు చెందిన ప్రసాద్ అనే యువకుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న గీత.. భర్త అడ్డు వస్తున్నాడని భావించింది. భర్త శ్రీనివాసులు మద్యానికి బానిస అయ్యాడని తరచూ గొడవపడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రియుడుతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది గీత. శ్రీనివాసులును హతమార్చి ఆపై గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టింది. తనకే పాపం తెలియదన్నట్లు వ్యవహరించిన గీత.. భర్త కనబడడం లేదని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. భర్త శ్రీనివాసులు మిస్సింగ్‌పై పిర్యాదు చేసి చేతులు దులుపుకుంది. అయితే గీత తీరుపై అనుమానంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీనివాసులను హత్య చేసింది గీతనేనని తేల్చారు. పక్క గ్రామం ఎగువ దొనబైలుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండటం వల్లే భర్త శ్రీనివాసులును పక్కా ప్లాన్‌తో కడతేర్చిందని పోలీసులు గుర్తించారు. మరోవైపు పథకం ప్రకారమే తాము హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారు గీత, ప్రసాద్. శ్రీనివాసులును బండరాయితో మోది హత్య చేసినట్లు గీత ఒప్పుకుంది. ప్రియుడు ప్రసాద్, గీత తండ్రి వెంకటస్వామి.. ఇద్దరూ బైక్‌పై మృతదేహాన్ని సమీపంలో ఉన్న అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి పూడ్చిపెట్టి వచ్చినట్లుగా నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీంతో మదనపల్లి తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి శవపంచనామా నిర్వహించి రీ-పోస్టుమార్టం పూర్తి చేసిన పోలీసులు.. గీత, ఆమె ప్రియుడు ప్రసాద్, తండ్రి వెంకటస్వామిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు