తిరుపతి బలిజ కులస్థుల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయండి - డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
ఈ నెల 21 తేదిన తిరుపతిలో తలపెట్టిన బలిజ కులస్థుల ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేయాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కోరారు. స్థానిక రామచంద్ర పుష్కరిణీ వద్ద పొన్నాల చంద్ర ఫంక్షన్ హాలులో జరిగిన బలిజ కుల ముఖ్య నాయకుల సమావేశంలో అయన మాట్లాడుతూ బలిజలను అన్నింటా ఆదరించి ప్రోత్సహిస్తున్న భూమన అభినయ్ రెడ్డికి పూర్తి స్థాయిలో సహకరించి వారి గెలుపులో భాగస్వామ్యం కావాలన్నారు. ముందు చూపు పట్టుదల ఉన్న అభినయ్ రెడ్డి లాంటి యువ నాయకుడు తిరుపతి ఎమ్మెల్యే అయితే తిరుపతికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలం బాలాజీ, బెల్లం రమేష్, నంద గోపాల్, పొన్నాల చంద్ర, దూది కుమారి, సునీత, దోరై రాజు, వై.సురేష్, దూది శివ, అనిల్ రాయల్, సునీల్ చక్రవర్తి, బాలిశెట్టి కిషోర్, వెంకటేష్ రాయల్, మద్దాలి శేకర్, పసుపులేటి సురేష్, కరాటే శ్రీను, దినేష్, విజయలక్ష్మి, కవిత, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment