రైతులను విస్మరించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం - గుండెబోయిన నాగమణి
- రైతు ఋణమాఫీ, రూ.500 బోనస్ ప్రస్తావనే లేదని ఆగ్రహం
మహబూబాబాద్, త్రిశూల్ న్యూస్ :
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించిదని మహబూబాబాద్ జిల్లా బిజెపి నాయకురాలు గుండెబోయిన నాగమణి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పటమే కాని ఓటన్ బడ్జెట్ లో రైతు ఋణమాఫీ, రైతులకు గిట్టుబాటు ధర, వరికి క్వింటాళ్లకు ₹ 500 లు బోనస్ కు సంభందించి కేటాయింపులు లేకపోవడం దారుణం అని, రైతు బంధుకు మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపుకోవడం జరిగిందని విమర్శించారు. రైతు ఋణమాఫీ కావాలంటే సుమారుగా రూ.25వేల కోట్లు అవసరం కాని వాటిని చూపకుండా ఋణమాఫీ చేస్తాం , కార్యాచరణ చేస్తాం అని చెప్పటం రైతులను మోసం చేయడమే అని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లుకు కేటాయింపులు చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్లు లేవనే అర్దం అవుతుందని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లుల చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16, 500 ఇళ్లకు రూ.20,825 కోట్లకు గాను రూ.7740 కోట్లు కేటయించటం చూస్తే ప్రతి నియోజకవర్గానికి 1300 ఇళ్ళులు మాత్రమే నిర్మించే అవకాశం ఉందన్నారు. అంటే ఇందిరమ్మ ఇళ్ల ప్రస్థానం లేదనే చెప్పవచ్చు, సుమారు రూ.32వేల కోట్ల ద్రవ్యలోటును ఏలా సర్దుబాటు చేస్తారో చూపకపోవడం చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసిఆర్ బాటలోనే నడుస్తున్నట్లు కనిపించిందని, బడ్జెట్ చూస్తుంటే రైతు ఋణమాఫీ అనేది ఈ ఆర్థిక సంవత్సరం ఉండదనేది అర్థం అవుతుందని ఆమె విమర్శించారు .
Comments
Post a Comment