పేదవాడి పెదవులపై చిరునవ్వే జగనన్న సంక్షేమ అభివృద్ధికి నిదర్శనం..!

- సత్యవేడు వైకాపా నియోజకవర్గ ప్రఛార కార్యదర్శి ఓడూరు ఉజ్వలరెడ్డి
సత్యవేడు, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల వైసిపి కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, రానున్న సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి నిత్యం ప్రజల మధ్య ఉంటూ బూతు స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వైకాపా సత్యవేడు నియోజకవర్గ ప్రఛార కార్యదర్శి ఓడూరు ఉజ్వల రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అని అన్నారు. పేదవారికి పెత్తందార్లుకు మధ్య జరిగే యుద్ధానికి అందరం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రౌండ్ లెవెల్ లో వైసిపి బలంగానే ఉన్నాం అంటే ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి అక్కాచెల్లెళ్ళులకు, ప్రతి సోదరుడి, ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా వారి గడపగడపకు చేర్చిందన్నారు. అందుకే అందరూ ఆత్మవిశ్వాసంతో ప్రతి ఇంటికి వేళ్ళి ఈ సంక్షేమ పథకాలు మళ్ళి కులాలకు, మతాలకు, పార్టీలకు, రాజకీయాలకు, అతీతంగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చేసింది మనందరి ప్రభుత్వం అని మనం చేసిన మంచిని వారికి తెలపాలని పార్టీ శ్రేణులను కోరారు. అన్నింటికన్నా ముఖ్యంగా మనం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఏవిధంగా అయితే మనం కష్ట పడుతున్నామో ఆ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంతకు రెట్టింపు ఆలోచనలతో విద్యావ్యవస్థలో పేను మార్పులు తీసుకువచ్చి పిల్లలు ముఖంలో చిరునవ్వు ఉదయింపచేసిన ఘనత జననేతకే సాధ్యంమని గుర్తుచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పేదలకు వైద్యం అందించేందుకు మునుపెన్నడూ లేని విధంగా ఇంటివద్దేకే ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారు. అలాగే సచివాలయం వ్యవస్థ అనుసంధానం ద్వారా ప్రజలందరికీ విలేజ్ క్లీనింగ్ ద్వారా వైద్యసేవలు మహిళ భద్రత కోసం మహిళా పోలీస్, వాలంటీర్లు సేవలు ద్వారా ప్రజలకు ఇంటి వద్దకే అన్ని రకాల సేవలు ఇలా చెప్పుకుంటూ పోతే అనాడు మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం స్థాపన నేడు జగన్మోహన్ రెడ్డి ద్వారా సాద్యం అయింది అన్నారు. అలాగే రైతులకు రైతు భరోసా కేంద్రాలు నిర్మించి రైతులకు గిట్టుబాటు ధరలు కూడా కల్పించిన స్పూర్తిదాత వైఎస్ ఆర్ తర్వాత రైతుల పక్షపాతి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అందుకే ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు యధా తరంగా నేరుగా మీ గడప వద్దకే కొనసాగాలంటే జననేత జగనన్నకు మీ అమూల్యమైన ఓటును ప్యాన్ గుర్తుపై వేసి సత్యవేడు నియోజకవర్గంలో ఏడు మండలాల్లో వైసిపి కి తిరుగులేని ఆధిక్యాన్ని ఇవ్వాలని, విలువలు విశ్వసనీయతకు మళ్ళీ సత్యవేడు నియోజకవర్గంలో పట్టం కట్టాలని, ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయిన్ లా ఉంటూ మేము సిద్దం.. మా పోలింగ్ బూత్ సిద్ధం అనే నినాదంతో మళ్ళీ వైయస్ ఆర్ సిపి జెండాను మరోసారి రెపరెపలాడించాలనీ ప్రజలను, ప్రతిఒక్క నాయకుడిని, కార్యకర్తలను, వైఎస్ ఆర్ సీపీ కుటుంబ సభ్యులను, అభిమానులను కోరుతున్నామని తెలిపారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు