తిరుపతి జంతు ప్రదర్శనశాలలో చికిత్స పొందుతున్న చిరుత మృతి..!
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిరుత చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పెనుగొండ దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిరుతను మెరుగైన చికిత్స కోసం అధికారులు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంట ప్రదర్శనశాలకు తరలించారు. 'జూ'లో సంజీవిని హాస్పిటల్ లో వెటర్నరీ వైద్యులు వైద్యం అందించినా ఆరోగ్యం క్షీణించడంతో చిరుత మృతి చెందింది. పోస్టు మార్టం నిమిత్తం చిరుత మృతదేహాన్ని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. వెటర్నరీ అధికారులు పోస్టుమార్టం చేయగా (సెప్టిసెమిక్ షాక్ మరియు లింఫోసార్కోమా) Septicemic shock and Lymphosarcoma. కారణంగా చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు.
Comments
Post a Comment