రుయా ఆసుపత్రి కళ్ళ విభాగానికి కళ్ళు దానం చేసిన యువకుడు..!

తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువకుడు మరణానతరం తన కళ్ళను దానం చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారము రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు, ఆధ్వర్యంలో కంటి (ఆఫ్తమాలజీ) విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి పర్యవేక్షణలో ఆనారోగ్యంతో బాధపడుతూ రుయా ఆసుపత్రి డయాలసిస్ విభాగం నందు చికిత్స పొందుతూ మరణించిన తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం, వేలంపల్లెకు చెందిన సి హెచ్. సాయిరాం, 33 సంవత్సరాల యువకుడు వారి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు రుయా ఆసుపత్రి కళ్ళ బ్యాంకుకు అతని కళ్ళు దానం చేయడం ఎంతో గొప్ప విషయమని , యువకులు ఈ విధంగా ముందుకు రావడంతో యువతకు చైతన్యం కలిగించినట్లు, ఉంటుందన్నారు. చనిపోయిన అనంతరం మన యొక్క అవయవాలు పదిమందికి ఉపయోగకరంగా ఉంటుందని గ్రహిస్తున్న యువత. కావున ఎవరైనా కళ్ళు గాని అవయవ దానం గాని ముందుకొచ్చినట్లయితే కళ్ళ విభాగాధిపతి డాక్టర్ చలపతి రెడ్డి , కళ్ళ విభాగ టెక్నీషియన్ ని రమేష్, అతని సెల్ ఫోన్ నెంబర్: 99484 88597 కు విషయాలు తెలిపరిచినట్లయితే విభాగాధిపతి కి రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ తో చర్చించి కళ్ళు దానం తీసుకుని కళ్ళు లేని పేద రోగులకు అమర్చడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ విధంగా కళ్ళు లేని వారు మేము అంధులము కాదు అని వారి జీవిత కాలాన్ని కొనసాగించడానికి చేదోడుగా ఉంటుందని కళ్ళు దానం చేసిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు, కళ్లదాన సర్టిఫికెట్ వారికి ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కళ్ళ విభాగ టెక్నీషియన్ రమేష్, ఎస్ వి వైద్య కళాశాల పి ఆర్ ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు