వైసిపి నేతలు క్రీడాకారుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు - పిఎస్. మునిరత్నం

కుప్పం, త్రిశూల్ న్యూస్ :
వైసీపీ అధికారంలోకి వచ్చాక క్రీడాకారుల జీవితాల్లో చలగాటం ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ పిఎస్ మునిరత్నం మండిపడ్డారు. బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ ఇన్చార్జ్ పిఎస్ మునిరత్నం పత్రిక ప్రకటన విడుదల చేశారు. జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న తిరుపతి వైసిపి కార్పొరేటర్ పుత్రరత్నాన్ని పద్ధతి మార్చుకోవాలని మందలించడమే ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి చేసిన మహాపరాదమా అని ప్రశ్నించారు. భారత్ తరపున 16టెస్ట్ మ్యాచ్ లు ఆడి, ఆంధ్రా రంజీ జట్టుకు ఏడేళ్లు ఏకధాటి కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం.. వైసిపి వీధి నాయకుడి పంతం ముందు దిగదుడుపేనా అని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు శరత్ చంద్రారెడ్డిని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించినపుడే ఎసిఎ పరువు బంగాళాఖాతంలో కలిసిపోయింది అన్నారు.
విహారీని కెప్టన్ గా కొనసాగించాలని ఈ సందర్బంగా కోరారు. ఆశ్విన్ సహా అనేక మంది విహారికి సంఘీభావం తెలిపారున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోషియోషన్ రాజకీయ ఒత్తిడికి గురై రాష్ట్రానికి అప్రతిష్ఠ తెచ్చే విదంగా విహారి పట్ల అనుసరించడం సరైనది కాదన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు