భూ హక్కు కొత్త చట్టం వలన ప్రజల భూ హక్కులకు విఘాతం - పులివర్తి నాని

- న్యాయవాదుల రిలే నిరాహారదీక్షకు పులివర్తి నాని సంఘీభావం
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
       రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్టు(భూ హక్కు చట్టం) 2023 వలన సామాన్య ప్రజల భూ హక్కులకు విఘాతం కలుగుతుందని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. శుక్రవారం తిరుపతిలో న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ ఈ చట్టం వలన పేదవారికి తీరని అన్యాయం జరగబోతోందన్నారు. సదరు చట్టం రాకమునుపు పేదవారు తమ భూ హక్కులను పొందాలంటే సివిల్‌ కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందే వారని ఇప్పుడు ఈ చట్టం వలన సామాన్య ప్రజలు సివిల్‌ కోర్టు ద్వారా న్యాయం పొందే వీలుండదన్నారు. రాష్ట్రంలోని ప్రజలు తీవ్రమైన సమస్యలను చవిచూడాల్సి వస్తోందన్నారు. ఒక రకంగా చేప్పాలంటే న్యాయవ్యవస్ధను బలహీన పరిచేలా ఉందన్నారు. ఇదేకనుక జరిగితే ప్రజాస్వామానికి ప్రమాదం ఏర్పడుతుందన్నారు. స్వాతంత్య్రం ముందు నుంచి కూడా భూ హక్కు చట్టం, భూహక్కులు నిర్ణయించే హక్కు సివిల్‌ కోర్టులకే ఉండేదన్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సివిల్‌ కోర్టు పరిధి నుంచి తీసేయడం వలన ప్రజలు తగిన న్యాయం పొందలేరన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టం ద్వారా ప్రజల స్థిరాస్తులకు రక్షణ ఉండదని, దీనిని వెంటనే రద్దుచేయాలన్నారు. 
ఈ చీకటి చట్టం గురించి న్యాయవాదులు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందని పులివర్తి నాని తెలిపారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు