13 రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్..!

న్యూఢిల్లీ, త్రిశూల్ న్యూస్ :
లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది.. ఈ విడత లో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ను నిర్వహించనున్నారు. వాస్తావానికి 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వ హించాల్సి ఉండగా 88 స్థానాల్లోనే పోలింగ్ జ‌రుగు తోంది. ఎందుకంటే.. మధ్య ప్రదేశ్‌లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలవి ఏప్రిల్ 9న చనిపోయారు. దీంతో అక్కడ జరగాల్సిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశకు మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున బీహార్‌లోని పలు స్థానాల పరిధిలో పోలింగ్ సమయా న్ని పెంచుతున్న‌ట్టు ఈసీ తెలిపింది. బంకా, ఖగారియా, ముంగేర్, మాధేపురా స్థానాల పరిధిలోని సమ స్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే.. ఎండల కార‌ణం గా ఓటర్ల సౌకర్యం కోసం ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6గంటల వరకు పొడిగిం చారు. ముంగేర్‌లోని 230 పోలింగ్ స్టేషన్లు, ఖగేరియా లోని 299, మాధేపురాలోని 207, బంకాలోని 363 పో లింగ్ స్టేషన్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు