మే 2న చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో మైక్రో అబ్జర్వర్ లకు శిక్షణ - చిత్తూరు కలెక్టర్

- ఎన్నికల అబ్జర్వర్ ల సమక్షంలో పకడ్భందీగా పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ 

- మే 3, 4 తేదీలలో నియోజకవర్గ ఆర్ ఓ ల సమక్షం లో పి ఓ లు, ఏ పి ఓ లకు శిక్షణా తరగతుల నిర్వహణ

- జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
సాధారణ ఎన్నికలు – 2024 కు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించే పిఓ లు, ఏపిఓ లు, ఓపిఓ లకు సంబంధించిన రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్భందీగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. షణ్మోహన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో 170 – నగరి అసెంబ్లీ, 171 – జిడి నెల్లూరు (ఎస్ సి) నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ కైలాష్ వాంఖడే, 172 – చిత్తూరు, 173 – పూతలపట్టు (ఎస్ సి), 174 – పలమనేరు, 175- కుప్పం నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్ షాదిక్ అలం లు మరియు రాజకీయ పార్టీల సమక్షంలో పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్దేశిత వెబ్ సైట్ నందు పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను అబ్జర్వర్లు, రాజకీయ పార్టీల సమక్షంలో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో 1,889 మంది పి ఓ లు, 1,993 మంది ఏ పి ఓ లు, ఓ పి ఓ లు 7,961 మంది ర్యాండమైజేషన్ ప్రక్రియ చేయడం జరిగందని తెలిపారు. నగరి నియోజక వర్గానికి సంబంధించి పుత్తూరు, వడమాలపేట మండలాలలో ఎన్నికల నిర్వహణ చిత్తూరు జిల్లా పరిధిలో జరుగు చున్నప్పటికీ పోలింగ్ సిబ్బందిని తిరుపతి జిల్లా నుండి కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ అబ్జర్వర్లకు వివరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొత్తగా ఓపిఓ లుగా అంగన్వాడి వర్కర్ లను కూడా పోలింగ్ విధులకు అనుమతించడం జరిగందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ (పి ఓ) తో పాటు ఒక (సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్) ఏపిఓ, నలుగురు (ఇతర పోలింగ్ అధికారులు) ఓపిఓ లు ఉంటారని పిఓ లు, ఏపిఓ లకు మే 3, 4 వ తేదీలలో వారికి కేటాయించిన నియోజకవర్గాల ఆర్ఓ సమక్షంలో పోలింగ్ నిర్వహణ పై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మే 2న మైక్రో అబ్జర్వర్ లకు నాగయ్య కళాక్షేత్రం నందు శిక్షణ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ శివయ్య, డిఐఓ సుధాకర్ రావు, అడిషనల్ డిఐఓ భాను ప్రకాష్, వెంకటేశ్వర రావు, టిడిపి ప్రతినిధి సురేంద్ర కుమార్, ఐ ఎన్ సి భాస్కర్, వై యస్ ఆర్ సి పి ఉదయ కుమార్, బిజేపి అట్లూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు