అంతరిక్షంలో భూమికి దగ్గరగా అతి పెద్ద బ్లాక్ హోల్.. సూర్యుని కంటే 33 రెట్లు పెద్దది..!
న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
విశ్వంలో అంతచిక్కని రహాస్యాల్లో బ్లాక్ హోల్ కూడా ఒకటి. బ్లాక్ హోల్ ఏర్పడుతుందనే దానిపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. జీవిత కాలం ముగిసిన నక్షత్రాలే ద్రవ్యరాశి కోల్పోయి బ్లాక్ హోల్ లేదా కృష్ణ బిలాలుగా మారతాయని చాలామంది శాస్త్రవేత్తుల నమ్ముతున్న విషయం. అయితే భూమికి దగ్గరగా మన గ్యాలక్సీలో ఓ బ్లాక్ హోల్ ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు ప్రకటించారు. ఇది సూర్యుని ద్రవ్యరాశికి దాదాపు 33 రేట్లు పెద్దని గియా స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు. అంతేకాదు పాలపుంత గెలాక్సీలో అదిపెద్ద బ్లాక్ హోల్ ఇదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భూమికి 2వేల కాంతి సంవత్సరాల కంటే తక్కువ దూరంలో ఉన్న అక్విలా నక్షత్రరాశిలో శాస్త్రవేత్తలు "స్లీపింగ్ జెయింట్" బ్లాక్ హోల్‌ను కనుగొన్నారని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఒక సంవత్సర కాలంలో భూమి మీదకు ప్రయాణించిన సూర్యకాంతి దూరాన్నే కాంతి సంవత్సరం లేదా లైట్ ఈయర్ అంటారు. ఒక కాంతి సంవత్సరం అంటే 9ట్రిలియన్ కి.మీ ల దూరం. ఇది గియా స్పేస్ అబ్జర్వేటరీని ఉపయోగించి కనుగొనబడిన మూడవ ఇనాక్టి్వ్ బ్లాక్ హోల్ అని దీనికి గయా BH3 అని పేరు పెట్టారు. సెకన్ కు 3లక్షల దూరం వేగంతో ప్రయాణించే కాంతి కూడా ఈ బ్లాక్ హోల్స్ నుంచి తప్పించుకోలేవు. ఇవి చాలా గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. ఈ కృష్ణ బిలాలకు దగ్గరకు వచ్చిన నక్షత్రాలు, గ్రహాలను తనలో కలిపేసుకుంటూ అంతకంతా వాటి పరిమాణాన్ని పెంచేసుకుంటాయి.
Comments
Post a Comment