కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయంలో అగ్నిప్రమాదం..!

న్యూఢిల్లీ, త్రిశూల్ న్యూస్ :
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం హోం శాఖ ఆఫీస్‌లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కార్యాలయంలోని కంప్యూటర్లు, పత్రాలు, ఫైళ్లు, జిరాక్స్ మిషన్‌కు మంటలు అంటుకుని కాలి బూడిదైనట్లు గుర్తించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడ లేరని అధికారులు వెల్లడించారు. కొందరు సీనియర్ అధికారులు ఉన్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 9.20 గంటలకు ఆఫీస్‌లో అగ్నిప్రమాదం సంభవించి నట్లు వివరించారు. నార్త్‌ బ్లాక్‌లోని ఐసీ డివిజన్‌లోని రెండో ఫ్లోర్‌లో ఈ మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు. అమిత్ షా ఆఫీస్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అధికారులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారు లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. 7 ఫైర్‌ ఇంజన్ల సాయంతో ఎగిసి పడిన మంటలను అదుపు చేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చు కున్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు