గడిచిన ఐదేళ్లలో తీన్మార్ మల్లన్న అలుపెరగని పోరాటం..!
- కేసిఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో తీన్మార్ మల్లన్న ముఖ్యపాత్ర
- ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించడంపై హర్షం
కొల్లాపూర్, త్రిశూల్ న్యూస్ :
గడచిన ఐదేళ్లలో కెసిఆర్ ప్రభుత్వం పై తీన్మార్ మల్లన్న అలుపెరగని పోరాటం చేశారని అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తన సేవలను గుర్తించి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిందని కొల్లాపూర్ తీన్మార్ మల్లన్న టీం, కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించడంతో గురువారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి టీం సభ్యులు అవుట రాజశేఖర్ ఆధ్వర్యంలో పూలమాలవేసి హార్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రంగినేని జగదీశ్వరుడు, కౌన్సిలర్ రహీం, మాజీ సర్పంచ్ మేకల నాగరాజు, వీపన గండ్ల మండల అధ్యక్షుడు బీరయ్య యాదవ్, పెంట్లవెల్లి మండల అధ్యక్షుడు నరసింహ యాదవ్, రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మ తేజ, మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాందాసు మాట్లాడారు. కేసిఆర్ పదేళ్ల అరాచక పాలనలో ప్రజలను చైతన్య పరచడంలో తీన్మార్ మల్లన్న ముందున్నారన్నారు. వాస్తవాలను చూపించినందుకు, మాట్లాడినందుకు వారిపై అక్రమ కేసులు పెట్టి సుమారు 100 రోజులు జైల్లో పెట్టారని తెలిపారు. తీన్మార్ మల్లన్న ఎక్కడ భయపడకుండా, వెనకడుగు వేయకుండా కేసిఆర్ ప్రభుత్వం పై పోరాడారాని చెప్పారు. తీన్మార్ మల్లన్న సేవలను గుర్తించి ఎమ్మెల్సీ టికెట్ కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వడం జరిగిందన్నారు. తీన్మార్ మల్లన్న గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పట్టభద్రుల ఎన్నికలలో తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ప్రచారం కూడా చేస్తామని తెలిపారు. టికెట్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి ఎమ్మెల్యేలకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘు నాయుడు, బండారు స్వామి, లక్ష్మణ్,బాలరాజు ప్రిన్స్, ఎస్ కే ఖాదర్ పాషా, వెంకట రాములు, సురేందర్, సందీప్, సూర్యనారాయణ, కిరణ్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment