నారా భువనేశ్వరి రెండు రోజుల పర్యటనను విజవంతం చేయండి - ఎమ్మెల్సి కంచర్ల శ్రీకాంత్

- తొలిసారిగా చంద్రబాబు తరఫున కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి

- రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ 

- కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న భువనేశ్వరి
కుప్పం, త్రిశూల్ న్యూస్ : 
తెలుగుదేశం పార్టీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో రెండు రోజుల పర్యటనను విజయవంతం చేయాలని తూర్పు రాయలసీమ పట్టుభద్రుల ఎమ్మెల్సి కంచర్ల శ్రీకాంత్ కోరారు. గురువారం కుప్పం టిడిపి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. రేపు కుప్పం నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు తరుపున నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయునున్నట్ల తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం లక్ష్మిపురం వరదరాజులస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కుప్పం చెరువు కట్టపై నుంచి భారీ ర్యాలీ చేపట్టానున్నట్లు పేర్కొన్నారు. నేతాజీ రోడ్డు మీదుగా ర్యాలీగా వెళ్లి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టిన మధ్యాహ్నం 1.27 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం కుప్పం టీడీపి కార్యాలయం నందు పార్టీ కార్యకర్తలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్బంగా సామగట్టపల్లె శ్రీ కదిరి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత గ్రామ ప్రజలతో మమేకమవుతారన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ మహిళలతో సమావేశం అనంతరం మధ్యాహ్నం చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా కుప్పం ఆర్టీసీ బస్టాండ్ కూడలి నందు అన్నా క్యాంటిన్ లో అన్నదానం నిర్వహిస్తామని చెప్పారు. తరువాత పార్టీ కార్యాలయంలో గత 35ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతూ.. పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన నిరంతర కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గంలోని టీడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తోపాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ టీడిపి ఇంఛార్జి పి ఎస్ మునిరత్నం, నియోజకవర్గ టిడిపి విస్తరణ విభాగ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు, మాజీ వ్యవసాయ కమిటీ మాజీ అధ్యక్షులు సత్యేంద్ర శేఖర్, కుప్పం పురపాలక సంఘం టీడిపి అధ్యక్షులు రాజ్ కుమార్, శాంతిపురం మండల టీడిపి అధ్యక్షులు విశ్వనాథ నాయుడు, కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు