భూమన అభినయ్ ని ఆశీర్వదించండి - భూమన కరుణాకర్ రెడ్డి
- తిరుపతిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టుకుందాం
అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న కూటమిని చిత్తుగా ఓడించండి
- ఇంటింటా సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి బుధవారం సాయంత్రం స్థానిక 42వ డివిజన్ పరిధిలో మయాని శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాక రెడ్డి కరపత్రాలను అందజేస్తూ, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఔదార్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. డిప్యూటీ మేయర్ గానే భూమన అభినయ్ తిరుపతిని దేశంలోనే ఓ ఆదర్శ నగరంగా తీర్చిదిద్దారని.. తిరుపతి ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా తిరుపతిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణ ఆలోచన భూమన అభినయ్ దే అని అన్నారు. భూమన అభినయ్ కి గొప్పగా ఆలోచించే సామర్థ్యం ఉందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూటమి వాళ్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర రెడ్డికి ప్రజలు నీరాజనాలు పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. మంగళ హారతులు పట్టారు. వీధి వీధి లో గజ మాలలతో సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తిరుపతి మునిరామిరెడ్డి, తిరుత్తణి శైలజ, దూది కుమారి, పుల్లూరు అమరనాధ రెడ్డి, పరదేశి నరేంద్ర, నారాయణ, కోఆప్షన్ సభ్యులు మట్లి వెంకటరెడ్డి, శ్రీదేవి, వైఎస్సార్ సీపీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పెంచలయ్య, మల్లం రవిచంద్రా రెడ్డి, కేతం జయచంద్రా రెడ్డి, లింగం రమేష్, మణ్యం ముని రెడ్డి, కేఎమ్ సత్యా, ముని శేఖర్ రాయల్, ఆరె అజయ్ కుమార్, విజయా రెడ్డి, రామచంద్రారెడ్డి, ఆర్వీ మగీ మొదలియార్, జనార్దన్ రెడ్డి, కొల్లి రఘురామి రెడ్డి, సి కుమార్, ఏడీఆర్, కంకణాల రమేష్ నాయుడు, పవన్, జీవరత్నం రెడ్డి, పోలిరెడ్డి నాగిరెడ్డి, మాధవ నాయుడు, కొండ బాలసుబ్రమణ్యం రెడ్డి, దేవదానం, పెరుగు బాబు యాదవ్, అరుణ్ కుమార్, తోట పద్మ, చెంగల్ రాజు, దాసు, దూది శివ రాయల్, పుష్ప యాదవ్, బ్రహ్మానంద రెడ్డి, కల్లూరు చంగయ్య, మస్తానమ్మ, మధు, లవ్లీ వెంకటేష్, తాళ్లూరి ప్రసాద్, సతీష్, కొమ్ము చెంచయ్య యాదవ్, దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, అజయ్ కుమార్, యోగాంజనేయరెడ్డి, గిరి, వెలకచర్ల గోపాల్ రెడ్డి, వంశీకృష్ణ, బొగ్గుల వెంకటేష్, మల్లంగుంట కరుణాకర రెడ్డి, పాదిరి ద్వారక నాథ రెడ్డి, విడగొట్టు రమణ, రామకృష్ణయ్య యాదవ్, ముచ్చక్కాయల బాబు యాదవ్, పాల్గొన్నారు.
Comments
Post a Comment