రెండవ విడత ఎన్నికల శిక్షణ తరగతులు పూర్తి - రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
ఎన్నికల శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని , వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని నెల్లూరు సిటీ అసెంబ్లీ 117 నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి / కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, సెక్టర్ అధికారులకు స్థానిక డి.కె. మహిళా కళాశాలలో రెందవ విడత ఎన్నికల శిక్షణలో బాగంగా సోమవారం శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.ఓ. మాట్లాడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు శిక్షణ తరగతులను నిర్వహించి పి.ఓ, ఏ.పి.ఓ.ల విధి విధానాల గురంచి క్షుణ్ణంగా వివరిస్తామని, శిక్షణలో అన్ని అంశాలపట్ల ఉత్తమ తర్ఫీదును ఇచ్చి సందేహాలకు తావులేకుండా వివరించాలని మాస్టర్ ట్రైనర్స్ కు సూచించారు. శిక్షణలో ట్రయల్ పోలింగ్ నిర్వహించి, ఎన్నికల్లో చేయాల్సిన అన్ని విధులనూ చేయిస్తూ అవగాహన కల్పించారు. శిక్షణలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో మెటీరీయల్ పరిశీలించుకోవడం, మెటీరీయల్ స్వాధీనం పొందాక పోలింగ్ కేంద్రాలకు తరలించడం, మార్క్ పోల్ విధానం, ఈ.వి.ఎమ్ ల సీలింగ్ విధానం, ప్రతికూల పరిస్థితుల్లో ఈ.వి.ఎమ్ ల రీ ప్లేస్ మెంట్, వి.వి ప్యాట్ల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల్లో డిస్ప్లే బోర్డులు, హౌస్ ఆఫ్ పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల విధుల్లో పొరపాట్లు జరిగితే అప్పటికప్పుడు సరిదిద్దుకోలేము కాబట్టి శిక్షణలోనే పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఆర్వో పేర్కొన్నారు. అనంతరం శిక్షణలో పొందిన పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు ఎన్నికల అధికారులకు నమూనా పరీక్షను నిర్వహించారు. ఈ శిక్షణలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శర్మద, టి.పి.ఆర్.ఓ. ప్రసాద్, మేనేజర్ ఇనాయతుల్లా, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసింది - పవన్ కళ్యాణ్

కడుపు మండిన ఉద్యోగులు.. రేపు వర్సిటి బంద్ కు పిలుపు..!

ద్రావిడ ఉద్యోగుల నిరసన భగ్నానికి రిజిస్టర్ యత్నం? - ద్రావిడ ఉద్యోగులు